Brahmamudi Today January 2nd Episode: ఆసుపత్రిలో కల్యాణ్ ఒక్కడే ఉంటాడు. బయట ఎవరో ఫోన్ మాట్లాడుతూ సౌండ్‌తో ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇతర సందర్శకులు. దీంతో చిరాకు వచ్చిన కల్యాణ్ వెళ్లి వారిని కోప్పడతాడు. అప్పుడే అప్పు పోలీసు డ్రెస్సులో కనిపిస్తుంది, కట్ చేస్తే వేరే లేడీ పోలీస్. ఇక అప్పు మాటలు గుర్తు చేసుకుంటాడు కల్యాణ్. నువ్వు మంచి లిరిక్ రైటర్ అవ్వాలి అని అప్పు చెబుతోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కూడా అప్పు పోలీస్ డ్రెస్ వేసుకుని చూయించడం గుర్తు చేసుకుంటాడు.
ఇక కారులో సావిత్రిని ముప్పతిప్పలు పెడుతుంటాడు రాజ్. అతను కొబ్బరి బోండాలు తెస్తా అని కావ్యను కూడా కారు దిగమంటాడు. కావ్యను స్పెషల్ వ్యక్తిగా ట్రీట్ చేస్తూ ఉంటాడు సావిత్రి. ఇక సావిత్రి కోర్టులో గెలిచాడు అని కాల్ వస్తుంది. దీంతో కావ్యను మరింత పొగడటం మొదలుపెడతాడు. ఇది చూసిర రాజ్ ఉక్కిరిబిక్కిరైపోతాడు. సావిత్రి ఓవరాక్షన్ చూడలేకపోతాడు. చివరగా ఎలాగో అలా సావిత్రిని వదిలంచుకోవాలని చూస్తాడు. మళ్లీ కారు ఎక్కుతాడు సావిత్రి.
అప్పుడే ఫామ్ హౌస్‌కు గోపాలకృష్ణ వస్తాడు. మేడం వస్తుంది ఆమెకు కూడా ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని సెక్యూరిటీ గార్డ్‌కు చెబుతాడు. ఇక తన లవర్‌కు ఫోన్ చేసి రమ్మంటాడు. నేను రాను నిజంగా ప్రేమ ఉంటే నువ్వే బుక్ చేసుకుని రా.. నేను కావలనుకుంటే నువ్వే రా లేకుంటే నీ ఇష్టం అని ఫోన్ కట్ చేస్తుంది. వస్తేనే రాక చస్తానా అని లవర్‌ను పికప్ చేసుకోవడానికి బయలుదేరతాడు.
ఇదీ చదవండి : జియో ఎయిర్‌టెల్‌కు బిగ్‌షాక్ ఇస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ప్లాన్.. రోజుకు రూ.3 కంటే తక్కువ, 300 రోజుల వ్యాలిడిటీ..
సావిత్రి కనీసం ఈ పెళ్లి చూపుల్లో అయినా నీ పెళ్లి కుదరుతుందా? అంటాడు. లేడు మనస్సు మార్చుకున్నా అని మేడం మీకు పెళ్లైందా? అంటాడు. రాజ్ ను ఒక ఆట ఆడుకుందాం అనకుంటుంది. ఏం సావిత్రి నేను నీకు నచ్చానా? అంటుంది. అబ్బో నాకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది అంటారు. మీరు అప్సరస ఉన్నారు అంటాడు. దీంతో రాజ్ మళ్లీ చిర్రుబుర్రులాడుతాడు. ఏయ్ డ్రైవర్ మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా.. అంటాడు రాజ్‌ను సావిత్రి. డ్రైవర్‌వి డ్రైవర్లా ఉండు అంటాడు.
ఇదీ చదవండి : మగవాళ్లు 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుంటే ఈ సమస్య నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు..
అప్పుడే రాజ్‌కు పోలీస్ ఫ్రెండ్ ఫోన్‌చేస్తాడు. గోపాలకృష్ణ లొకేషన్ షేర్ చేస్తారు. వెంటనే అక్కడకి వెళ్తారు. సెక్యూరిటీ గార్డుతో మాట్లాడి లోపలికి వెళ్తారు. అక్కడ ఫస్ట్ నైట్ మాదిరి బెడ్‌ను పూలతో అలంకరిస్తారు. అక్కడ రాజ్ కావ్యలు భూత్ బంగ్లాను గుర్తు చేసుకుంటారు. బ్యాగ్రౌండ్ పాట వస్తుంది. వాళ్లు మళ్లి రొమాంటిక్‌గా మారిపోతారు. ఇక పొరపాటున ఇద్దరూ కలిసి ఆ పూల బెడ్‌పై పడతారు. ఒకరిని ఒకరు కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటారు. అప్పుడే గోపాలకృష్ణ కూడా లవర్‌తో తాగి ఊగుతూ వస్తుంటాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.