Sohel Lucky Lakshman Trailer బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన సోహైల్ ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతోన్నాడు. మోక్ష హీరోయిన్గా సోహెల్ హీరోగా వస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. హరిత గోగినేని ఈ సినిమానుదత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఎ.ఆర్.అభి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ డిసెంబర్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈక్రమంలో ‘లక్కీ లక్ష్మణ్’ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.
ఈ ట్రైలర్లో సోహెల్ అదరగొట్టేశాడు. డబ్బు చుట్టూ తిరిగే పాత్రలో సోహెల్ కనిపించాడు. డబ్బు సంపాదించాలనే ఆలోచనలో తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు. ఇక ప్రేమించిన అమ్మాయిని సైతం బాధపెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్తో పాటుగా సందేశం కూడా ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్లో సోహెల్ ఎనర్జీ మాత్రం కనిపిస్తోంది. సోహెల్ సత్తాను డిసెంబర్ 30న చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook