Manchu Manoj Police Complaint: గత కొంతకాలంగా మంచు కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతూ ఉండడంతో మంచు కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోతోంది. దీంతో అటు మోహన్ బాబు, మనోజ్, విష్ణు ఇలా ఒకరి మీద ఒకరు పలు రకాల కేసులను సైతం నమోదు చేస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మంచు కుటుంబానికి ఒక బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఏకంగా ఈ కుటుంబం మీద రెండు కేసులు చంద్రగిరి పోలీసులు బుక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా డైరీ ఫార్మ్ గేటు వద్ద జరిగిన ఘటన పైన ఇరు వర్గాల మీద కూడా ఫిర్యాదులు చేసిన ఆధారంగా రెండు కేసులు నమోదు చేసినట్లు చంద్రగిరి పోలీసులు తెలియజేస్తున్నారు.. మోహన్ బాబు పిఎ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో అటు మంచు మనోజ్ , మౌనికల మీద తో పాటుగా మరొక ముగ్గురి పైన కేసు నమోదు అయినట్లుగా తెలియజేశారు.
ఇక మనోజ్ కూడా తన భార్య మౌనిక పైన దాడికి ప్రయత్నించారు అంటూ రాత్రి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో మోహన్ బాబు పిఏ లతోపాటు MBU సంస్థలో పనిచేసే 8 మంది పైన కేసు నమోదు చేసినట్లు చంద్రగిరి పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ రెండు కేసుల పైన పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది
మోహన్ బాబు పి.ఏ.చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేసిన వారిలో ఎవరెవరున్నారు అంటే..A-1 గా మంచు మనోజ్ ఉండగా, A2గా మౌనిక, A3 గా రెడ్డి, A4 గా పళనీ రాయల్, A-5 గా పవన్ ఉన్నట్లు సమాచారం.
మనోజ్ ఫిర్యాదు చేసిన వారి లిస్టులో ఎవరెవరున్నారు అనే విషయానికి వస్తే..A1గా విజయసింహ, A2 గా సురేంద్ర, A3గా బాలాజీ, A4 గా సారధి, A5 గా కిరణ్, A6 గా రవిశేఖర్, A7గా హేమాద్రి, A8గా జిమ్ చంద్రశేఖర్,A9 యావ్స్ మనీ ఉన్నట్లు సమాచారం.
Read Also: ఈ 7 ఫుడ్స్ మీకు ప్రమాదకరం.. సైలెంట్‌గా మిమ్మల్ని క్యాన్సర్ రోగిగా మారుస్తాయి..
Read Also: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే దర్శనాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.