Ar rahman wife saira emotional post: ఏఆర్ రెహమాన్ మరోసారి వార్తలలో నిలిచారు. గతేడాది ఆయన భార్య.. రెహామాన్ తో విడాకులు తీసుకుంటున్నట్లు నవంబరు 19న ప్రకటించింది. అప్పటి నుంచి వీరి మధ్య జరుగుతున్న వివాదం వార్తలలో ఉంటుంది. రెహమాన్ తన దగ్గర పనిచేస్తున్న జూనియర్‌తో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే సైరాతో డైవర్స్ తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో రెహమాన్ తో పాటు, ఆయన మాజీ భార్య, పిల్లలు సైతం.. ఇది పూర్తిగా తమవ్యక్తిగత అంశమని.. దయచేసి దీని మీద ఇబ్బందికరంగా వ్యవహరించకూడదని కూడా పోస్ట్ లుపెట్టారు. కొంత మంది పనిగట్టుకుని మరీ ఏఆర్ రెహమాన్ ట్రోల్స్ చేశారు. దీనిపై ఆయన చట్టపరంగా ముందుకు వెళ్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ఏఆర్ రెహమాన్ మాజీ భార్య కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో ఏఆర్ రెహమాన్ కూడా తన భార్య కొలుకొవాలని ఆమెకు సపోర్ట్ గా పోస్టులు పెట్టారు.
అంతేకాకుండా.. ఆమె కోసం ప్రత్యేకంగా దువా కూడా చేసినట్లు సమాచారం. తాజాగా, ఆమె సర్జరీ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది. ఈక్రమంలో తాజాగా.. ఆమె ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.దీనిలో తనకు కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ భర్త రెహమాన్ కు, లాస్ ఏంజెల్స్ లోని రసూల్, ఆయన సతీమణి షాదియాలో పాటు.. స్నేహితులు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తనమాజీ భార్య కష్టకాలంలో నాకేంటని వదిలేయకుండా.. ఆమెకు సపోర్ట్ గా నిలిచి ఆరోగ్యం కుదుటపడేందుకు దువా చేసిన రెహమాన్ పై నెటజన్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా.. రెహమాన్ మీద ఆయన మాజీ భార్యకు ఎక్కడో ఇంకా ప్రేమ ఉందని.. ఇద్దరు కలిసి మాట్లాడుకుని సెట్ చేసుకొవచ్చు కదా.. అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి