Anshula Kapoor: లైవ్ వీడియోలో లోదుస్తులు తీసిపారేసిన స్టార్ హీరో చెల్లి.. దారుణంగా ఆడుకుంటున్నారుగా!

Anshula Kapoor: బోనీకపూర్ కుమార్తె స్టార్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ కెమెరా ముందే తన బ్రా తీసిన వీడియో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 03:59 PM IST
  • నో బ్రా మూమెంట్ అంటూ వీడియో షేర్ చేసిన అన్షులా
  • నెటిజన్ల నుంచి భిన్న కామెంట్లు
  • ట్రోల్ చేస్తున్న కొందరు నెటిజన్లు
Anshula Kapoor: లైవ్ వీడియోలో లోదుస్తులు తీసిపారేసిన స్టార్ హీరో చెల్లి.. దారుణంగా ఆడుకుంటున్నారుగా!

Anshula Kapoor Posts 'No Bra Club' Video: సోషల్ మీడియా ఇంతగా అందుబాటులోకి రాకముందు సినీ సెలబ్రిటీల పర్సనల్ జీవితాల మీద సాధారణ ప్రజలకు చాలా ఆసక్తి ఉండేది. ఫలానా హీరో ఎలాంటి తిండి ఎక్కువగా తింటాడు? ఫలానా హీరోయిన్ ఎక్కువ ఎలాంటి బట్టలు ధరించడానికి ఆసక్తి చూపిస్తుంది? లాంటి విషయాల మీద చాలా ఆసక్తి చూపించేవారు. కానీ సోషల్ మీడియాలో అందుబాటులో వచ్చేసిన తర్వాత కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే గాక వారి కుటుంబ సభ్యులు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు. అయితే ఒక్కోసారి వారు చేసే పనుల ద్వారా ట్రోలింగ్ కు కూడా గురవుతూ వస్తున్నారు.. తాజాగా ఒక స్టార్ ప్రొడ్యూసర్ కుమార్తె,  మరో స్టార్ హీరో సోదరి అయిన ఒక యువతి చేసిన పని ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఆమె మరెవరో కాదు స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ కుమార్తె స్టార్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్. బోనీకపూర్ శ్రీదేవిని వివాహం చేసుకోక ముందే మరో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య ద్వారా ఆయనకు అర్జున్ కపూర్,  అన్షులాపూర్ సంతానంగా జన్మించారు. అర్జున్ కపూర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో అనేక సినిమాల ద్వారా హిట్స్ కొట్టారు. కానీ అన్షులాకపూర్ మాత్రం సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఆమె బాలీవుడ్ వర్గాలలో మాత్రం సుపరిచితమే. అయితే తాజాగా ఆమె నోబ్రా మూమెంట్ అనే ఒక మూమెంట్ ను  ప్రమోట్ చేస్తూ వీడియో చేస్తూ కెమెరా ముందే తన బ్రా తీసిన వీడియో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

అంతేకాదు వీడియో షేర్ చేస్తున్న సమయంలో ఇప్పుడు ఎంతో రిలీఫ్ గా ఉందంటూ ఆమె కామెంట్ చేసింది. అయితే ఆమె చేసిన ఈ వీడియోకి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఆమె చేసిన పనిలో తప్పేముందని అడుగుతుంటే మరి కొంతమంది మాత్రం ఒక భారతీయ స్త్రీగా ఇలా చేయడం ఏమాత్రం బాలేదంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం హీరోయిన్లు లాగా ఆమె అందాలేమీ ఆరపోయటం లేదు కదా,  కేవలం తనకు నచ్చిన ఒక విషయాన్ని ఆమె చేసి చూపించడం కూడా తప్పు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద మాత్రం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పక తప్పదు.
 Also Read: Upasana Konidela: పిల్లల్ని కనొద్దన్న సద్గురు.. ఉపాసన ఏమన్నారో తెలుసా?

Also Read: R Narayana Murthy Mother Death: ఆర్‌ నారాయణ మూర్తికి మాతృవియోగం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News