Allu Arjun: రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీడియో వైరల్

Allu Arjun Supports Drugs Awareness Video: సినీ పరిశ్రమ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తోంది. డిసెంబర్‌ 5వ తేదీన పుష్ప 2 ది రూల్‌ విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌ కీలక వీడియోను విడుదల చేశారు. రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తికి పూర్తి చేశాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 28, 2024, 06:14 PM IST
Allu Arjun: రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీడియో వైరల్

Allu Arjun Drugs Video: తెలంగాణలో డ్రగ్స్‌ వినియోగం భారీగా ఉంది. వారాంతాల్లో జరిగే పార్టీలతోపాటు వీఐపీల పార్టీల్లో తప్పనిసరిగా డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉంటున్నాయి. చట్టాలు ఎన్ని తీసుకువచ్చినా.. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డ్రగ్స్‌ వినియోగం తగ్గకపోగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులతో డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సందర్భంగా విడుదలయ్యే ప్రతి సినిమాలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా వీడియో విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పుష్ప 2 ది రూల్‌ సినిమాకు సంబంధించి డ్రగ్స్‌పై బన్నీ వీడియో విడుదల చేశాడు.

ఇది చదవండి: Dhanush Divorce: కోర్టు తీర్పు.. ధనుష్‌, ఐశ్వర్యల 18 ఏళ్ల వివాహ మామిడాకులు విడాకులయ్యాయి

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మద్దతుగా నిలిచాడు. మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధిత కుటుంబాలకు అండగా నిలువాలని బన్నీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక చిన్న సందేశాత్మక వీడియో విడుదల చేశారు. వీడియో అనంతరం అల్లు అర్జున్‌ చిరు సందేహం ఇచ్చారు. 'మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1908కు ఫోన్‌ చేయండి' అని బన్నీ సూచించారు.

ఇది చదవండి: Sri Gandhari: ‘శ్రీ గాంధారి’లా భయపెట్టేందుకు వచ్చేస్తున్న హన్సిక.. డిఫరెంట్‌ లుక్‌లో అందాల భామ

'డ్రగ్స్‌ బాధితులను వెంటనే పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి సాధారణ జీవన శైలిలోకి వచ్చేవరకు జాగ్రత్త చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారి సహాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం. గుర్తుందిగా నంబర్‌ 1908' అంటూ అల్లు అర్జున్‌ పిలుపునిచ్చారు. ఈ వీడియో పుష్ప 2 టైటిల్స్‌కు ముందు కూడా తప్పక ప్రదర్శించే అవకాశం ఉంది.

సినీ పరిశ్రమ తన విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని గతంలో రేవంత్‌ రెడ్డి సినీ నటులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ వ్యతిరేకంపై స్పందించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో అగ్ర నటులు డ్రగ్స్‌పై వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, ఎన్టీఆర్‌ వీడియోలు చేయగా.. తాజాగా అల్లు అర్జున్‌ చేశారు. త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌ సినిమా కోసం రామ్‌ చరణ్‌ కూడా అవగాహన వీడియో విడుదల చేసే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News