Pushpa 2 Succes Meet: భార్య దగ్గర మన తగ్గినా పర్వాలేదు.. ‘పుష్ప 2’ సక్సెస్ మీట్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..

Pushpa 2 Delhi Succes Meet: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ప్యాన్ ఇండియా సక్సెస్ నేపథ్యంలో  ఈ చిత్ర యూనిట్ ఢిల్లీలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 12, 2024, 07:20 PM IST
Pushpa 2 Succes Meet: భార్య దగ్గర మన తగ్గినా పర్వాలేదు..  ‘పుష్ప 2’ సక్సెస్ మీట్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..

Pushpa 2 Delhi Succes Meet:  సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక (Rashmika) హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్ప 2’(pushpa 2) సక్సెస్ సాధించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ చిత్రం ఓ రేంజ్ వసూళ్లలతో దూసుకుపోతుంది. ఇప్పటికే హిందీలో ఈ సినిమా రూ. 406.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అంతేకాదు తక్కువ టైమ్ లో ఈ సినిమా అక్కడ రూ. 250 కోట్ల నెట్ వసూల్లు.. రూ.300 కోట్లు.. రూ. 400 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. అంతేకాదు కేవలం 6 రోజుల్లో ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పుష్ప 2 సినిమాను ఆదరించిన ప్రేక్షకులు.. ఎగ్జిబిట్లర్లకు థాంక్స్  చెబుతూ.. ఢిల్లీలో పుష్ప 2 ది రూల్ థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ థాంక్స్ మీట్ లో హీరో అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలు నవీన్, రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను ఈ రేంజ్ సక్సెస్ అందించిన ప్రేక్షకులు థాంక్స్ చెప్పారు.  

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ఈ దేశ ప్రజలకు ధన్యవాదాలు. ఇది లవ్ కాదు.. వైల్డ్ లవ్ అన్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న భారతీయులు, సినీ ప్రేమికులు ఎగ్జిబిటర్లు, చిత్ర యూనిట్ కు ఈ వేదికగా స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఇండియన్ సినిమాను బాక్సాఫీస్ రూల్ చేస్తోన్న మా డైరెక్టర్ బండి సుకుమార్ రెడ్డికే ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. ఆయన విజన్ నుంచే ఈ సినిమా పుట్టిందన్నారు. ముఖ్యంగా పుష్ప 1కు చూపించిన ఆదరణ మరవలేనిది. హిందీ చిత్ర పరిశ్రమ లేకపోతే ఈ రేంజ్ సక్సెస్ లేదంటూ తన వినమ్రతను ప్రకటించకున్నాడు.

ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. పోలీస్ విభాగాలు, మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెంబర్లు శాశ్వతం కాదు. కానీ ప్రేక్షకుల ప్రేమ మాత్రం శాశ్వతం అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. రికార్డులు అనేవి ప్రతిసారీ బద్దలవుతూనే ఉండాలి. కొత్త రికార్డులు నెలకొల్పుతూనే ఉండాలన్నారు. తెలుగు సినిమాలే కాదు.. ఏ చిత్ర పరిశ్రమనైనా సరే దీనిని బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా భార్యల గురించి భర్తలకు మీరిచ్చే సలహా ఏమిటి అని అక్కడి హోస్ట్ ప్రశ్నకు.. భార్య ముఖ్యంగా ఆడవాళ్ల ముందు మనం తగ్గినా పర్వాలేదు అని వ్యాఖ్యలు చేసిన నవ్వులు పూయించాడు.

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News