Jr NTR Vote: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగింది. వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ అలాంటిది ఏమీ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు తరలివచ్చారు. ఇక హైదరాబాద్‌లో సాధారణ ఓటర్లు గతంలో మాదిరి బద్దకించగా.. వీఐపీలు మాత్రం ఓటు వేసేందుకు బారులు తీరారు. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఓటేసేందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేకత చాటారు. ఓటు వేసిన అనంతరం తన అభిమాని గుండెపై సంతకం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Movie Stars Vote: మహేశ్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ ఎక్కడ ఓటు వేసేది ఇక్కడే..
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ హైదరాబాద్‌లో ఆసక్తికరంగా సాగింది. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య లక్ష్మీ ప్రణతితోపాటు తల్లితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కుటుంబసభ్యులంతా వరుసలో నిలబడి ఓటు వేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో మీడియా, అభిమానులు ఎన్టీఆర్‌ను చుట్టుముట్టారు. మీడియాతో కొన్ని మాటలు మాట్లాడిన అనంతరం తన వాహనం ఎక్కుతున్న సమయంలో ఓ అభిమాని ఎన్టీఆర్‌ను పిలిచారు.
Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు రావు
'అన్న.. అన్న ఒక ఆటోగ్రాఫ్ ప్లీజ్' అని పిలిచాడు. అంతే వెంటనే వెనక్కు తిరిగిన ఎన్టీఆర్ పేపర్ లేకపోవడంతో అభిమాను షర్ట్‌పై గుండె భాగంలో ఆటోగ్రాఫ్ చేశాడు. 'అన్న థ్యాంక్స్ అన్న' అంటూ ఆ అభిమాని మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానులను నిరుత్సాహపర్చాడు. ఎంతో ఓపికతో ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంటాడు. అందుకే యంగ్ టైగర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ 'దేవర' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ కొన్ని నెలల కిందట విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్‌ప ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయి.
NTR @tarak9999 Anna Spoke With Media 🔥🔥.
Everybody has to use the right of their vote. I think it is a good message which we need to pass on to the coming generations 👌👌👌.#TelanganaElections #LoksabhaElections2024 #APElections2024 pic.twitter.com/5jKvaP8C6c
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) May 13, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter