Aadhaar PVC Card: చాలామంది ఇప్పటికీ ఆదార్ కార్డు పేపర్ లామినేటెడ్ వినియోగిస్తుంటారు. ఇది చిరిగిపోవడమో లేదా నలిగిపోవడమో జరగవచ్చు. సులభంగా పాకెట్లో పెట్టుుకోవడం సాధ్యం కాదు. కానీ ఏటీఎం కార్డులా ఉండే ఆధార్ పీవీసీ కార్డు అయితే ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. ఎప్పుడూ వెంట ఉంచుకోవచ్చు. ఇది తీసుకోవడం చాలా సులభం.
ప్రతి భారతీయ పౌరుడికి యూఐడీఏఐ జారీ చేసే ఐడీ కార్డు ఆధార్ . ప్రభుత్వ,ప్రైవేట్ ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. అందుకే ఆధార్ కార్డు ఎప్పుడూ వెంట ఉంటే మంచిది. ఆధార్ పీవీసీ కార్డు అయితే ఇందుకు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు పీవీసీ రూపంలో ఉంటే భద్రపర్చుకునేందుకు అనువుగా ఉంటుంది. ఇదొక ప్లాస్టిక్ కార్డు కావడంతో ఎక్కువ కాలం మన్నుతుంది. పాడవదు. నీటిలో పడినా ఏం కాదు. కేవలం 50 రూపాయలు చెల్లించి ఆధార్ పీవీసీ కార్డు మీ సొంతం చేసుకోవచ్చు. ఆధార్ పీవీసీ కార్డును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
ఆధార్ పీవీసీ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి
ముందుగా యూఐడీఏఐ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి. లాగిన్ అయిన తరువాత మై ఆధార్ సెక్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆర్డర్ ఆధార్ కార్డు పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడిక ఆధార్ కార్డు 12 అంకెల్ని నమోదు చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. స్క్రీన్‌పై పీవీసీ కార్డు ప్రివ్యూ కన్పిస్తుంది. ఆర్డర్ చేసి తగిన ఫీజు చెల్లిస్తే మీ ఇంటి అడ్రస్‌కు ఆధార్ పీవీసీ కార్డు చేరుతుంది.
Also read: RBI on 2000 Notes: దేశంలో మిగిలిపోయిన 7 వేల కోట్ల 2 వేల నోట్లు, ఇక అవకాశం లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.