Jio Prepaid Offers: రిలయన్స్ జియో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆఫర్లతో మార్కెట్ వాటా పెంచుకుంటోంది. మొబైల్ పోస్ట్‌పెయిడ్, ఫైబర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో పాటు ఉచితంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సభ్యత్వం అందిస్తోంది. ఇప్పుుడు తాజాగా ప్రీ పెయిడ్ ప్లాన్స్‌కు సైతం ఆఫర్ వర్తింపచేసింది.
దేశంలో చాలాకాలంగా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కొత్త సినిమాలు ధియేటర్ విడుదలైన కొద్దిరోజులకే ఓటీటీల్లో విడుదలవుతుండటంతో ఓటీటీ వేదికలకు క్రేజ్ అధికమౌతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇలా చాలా ఓటీటీలున్నాయి. ఈ అన్ని ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇదొక ప్రీమియం ఓటీటీగా చెప్పవచ్చు. మిగిలిన ఓటీటీలతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ ఫీజు కూడా ఎక్కువ. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తూ రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకూ రిలయన్స్ జియో ఫైబర్, మొబైల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఉచితంగా అందించింది. ఇప్పుుడు రెండు రకాల ప్రీ పెయిడ్ ప్లాన్స్‌కు కూడా నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందిస్తోంది.
ఇందులో మొదటిది రిలయన్స్ జియో 1099 ప్లాన్. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా అన్ లిమిటెడ్ 5జి డేటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో యాప్స్ యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. మొబైల్ నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందుతుంది.
రిలయన్స్ జియో అందిస్తున్న రెండవ ప్లాన్ 1499. ఈ ప్లాన్ కూడా 84 రోజులకు ఉంటుంది. ఇందులో రోజుకు 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 5జీ అన్‌లిమిటెడ్ వెల్‌కమ్ ఆఫర్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో యాప్స్ యాక్సెస్ లభిస్తాయి. ఈ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
సాయి ధరమ్‌తేజ్, పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్రో ఆగస్టు 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జూలై 28న ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ విడుదలకై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలయన్స్ ప్రీ పెయిడ్‌లో ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. బ్రో సినిమాను వీక్షించవచ్చు.
Also read: Mahindra XUV700: మహీంద్రా XUV700లో పెద్ద సమస్య, లక్ష కార్లను రీకాల్ చేసిన కంపెనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook