Reliance Jio: ఇండియాను ఇతర దేశాలతో కలిపే భారీ మెగా ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం

Reliance Jio: టెలీకాం రంగంలో సంచలనమంటే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. ప్రపంచంలో అధికమౌతున్న డేటా అవసరాల నేపధ్యంలో రిలయన్స్ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇండియాను..సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, ఈజిప్ట్, జిబూటీ, సౌదీ, ఇటలీ దేశాల్ని కలపబోతోంది. ఎలాగంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2021, 06:16 PM IST
Reliance Jio: ఇండియాను ఇతర దేశాలతో కలిపే భారీ మెగా ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం

Reliance Jio: టెలీకాం రంగంలో సంచలనమంటే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. ప్రపంచంలో అధికమౌతున్న డేటా అవసరాల నేపధ్యంలో రిలయన్స్ మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇండియాను..సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, ఈజిప్ట్, జిబూటీ, సౌదీ, ఇటలీ దేశాల్ని కలపబోతోంది. ఎలాగంటే..

కర్లో దునియా ముఠ్ఠీమే.ఇది ప్రారంభంలో రిలయన్స్ ట్యాగ్‌లైన్. అందుకు తగ్గట్టే సంచలనాలతో దూసుకు వెళ్తోంది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్(Reliance Jio Infocom). ప్రపంచంలో డేటా అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రపంచంలో భారీ స్థాయిలో సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్ ( Internationalk Submarine cable project) ‌ప్రాజెక్ట్‌ను రిలయన్స్ ప్రారంభించింది. సముద్ర మార్గం ద్వారా అత్యాధునిక కేబుల్స్‌తో ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్, ఇండియా యూరప్ ఎక్స్‌ప్రెస్ పేర్లతో రెండు ప్రాజెక్టుల్ని ప్రారంభించనుంది. ముంబై, చెన్నై కేంద్రంగా 16 వేల కిలోమీటర్ల పొడవున సముద్రమార్గంలో కేబుల్ వేసి..సెకనుకు 2 వందల టెరాబైట్స్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. ఇండియాతో తూర్పున సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, పశ్చిమాన ఈజిప్ట్, జిబూటి, సౌదీ అరేబియా, ఇటలీ దేశాల్ని కలుపుతారు. 

మరో మూడేళ్లలో అంటే 2024 లోగా ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. రెండు ప్రాజెక్టులు ఒకదానితో మరొకటి అనుసంధానమై, అంతర్జాతీయ డేటా ఇంటర్ ఎక్స్ఛేంజ్ పాయింట్లను కలుపుతారు. ఇండియా వెలుపల కూడా వినియోగదారులు, కంపెనీలకు కంటెంట్, క్లౌడ్ సేవల విషయంలో సామర్ధ్యం పెంచేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయోగపడుతాయి. ఫైబర్ ఆప్టిక్ సబ్‌మెరైన్ టెలీకమ్యూనికేషన్స్ చరిత్రలో తొలిసారిగా ఈ వ్యవస్థ..ఇండియాను అంతర్జాతీయ నెట్‌వర్క్ పటంలో ఉంచుతాయి.

Also read: LIC PMVVY Scheme: ఎల్ఐసీ సరికొత్త పాలసీ, వారికి ప్రతినెల రూ.10,000 వరకు పెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News