Pure Ev Motorcycles: 2025లో ఐపీఓకు ప్యూర్ ఈవీ.. నాలుగేళ్లలో రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం

Pure Ev Motorcycles IPO: ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ని ప్రారంభించనుంది. రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మరిన్ని ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 19, 2024, 11:00 AM IST
Pure Ev Motorcycles: 2025లో ఐపీఓకు ప్యూర్ ఈవీ.. నాలుగేళ్లలో రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం

Pure Ev Motorcycles IPO: ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు పెరిగిపోవడానికి తోడు కాలుష్య నివారణ దిశగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈవీ వెహికల్స్‌కే ప్రభుత్వాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మన దేశంలోని ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ప్యూర్ ఈవీ మోటార్ సైకిల్స్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ని ప్రారంభించేందుకు ప్రణాళికలు వెల్లడంచింది. ప్రస్తుతం వృద్ధి ప్రగతిపథంలో కొనసాగుతున్న ఈ కంపెనీ.. స్థిరమైన ఆర్థిక లాభాలతో ముందంజలో ఉంది. గత మూడేళ్లుగా లాభాల్లో ఉన్న ఈ కంపెనీ.. FAME సబ్సిడీలపై ఆధారపడకుండా నగదు చెల్లింపులను సజావుగా నిర్వహించడం విశేషం. 85 శాతం వాటాను కలిగి ఉన్న కంపెనీ ప్రమోటర్లు, ఆపరేటింగ్ స్థాయిలో స్థిరంగా లాభాలను అర్జిస్తున్నట్లు ప్యూర్ ఈవీ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వ రాయితీలు లేకుండానే లాభాలను సాధించినట్లు తెలిపారు.

Also Read: Kendra Trikona Rajayogam: 30 యేళ్ల తర్వాత శక్తివంతమైన కేంద్ర త్రికోణ రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

ఇటీవల ప్యూర్ ఈవీ కంపెనీ నుంచి రెండు ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్లు మార్కెట్‌లోకి విడుదల అయ్యాయి. రానున్న నాలుగేళ్లలో 20 ఎక్స్ టర్నోవర్ వృద్ధి అంచనాలతో ముందుకు వెళుతోంది. ఐఐటీ హైదరాబాద్ సహకారం, యూకేలోని కోవెంట్రీ ఇంజినీరింగ్ సంస్థ పీడీఎస్ఎల్‌తో సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు చేయనున్నట్లు తెలిపారు.

భారత్‌ ఎలక్ట్రానిక్ విప్లవంలో తాము భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందని ప్యూర్ ఈవీ సీఈవో  రోహిత్ వదేరా చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు, స్కిల్, స్థిరత్వంతో తాము అగ్రగామిగా నిలిచామన్నారు. వినూత్న AI ఆధారిత టెక్నాలజీ, పనితీరు, సామర్థ్యంపై దృష్టి సారించామన్నారు. తాము కేవలం వాహనాలను విక్రయించడం లేదని.. సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ప్యూర్ ఈవీకి ప్రాంతీయ రవాణా కార్యాలయం స్థాయిలో 7 శాతం మార్కెట్ వాటా ఉందని.. భారతదేశం అంతటా టైర్ 1, టైర్ 2 నగరాల్లో విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. భారత్‌లో విక్రయించే ద్విచక్ర వాహనాలలో 65 శాతం వాటా ప్యూర్ ఈవీ మోటార్‌ సైకిళ్లదేనని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ ధరలు తగ్గుముఖం పట్టడం.. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రెండ్స్‌ను ప్రభావితం చేసేందుకు వ్యహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు ఆయన తెలిపారు. వినూత్న ఆఫర్లు, డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్కూటర్లు, మోటర్ సైకిళ్ల విక్రయాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. రానున్న నాలుగేళ్లల్లో ప్యూర్ఈవీ 2 వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ను చేరుకునే దిశగా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

Also Read: Business Ideas: ఏడాది పొడవునా డిమాండ్ తగ్గని బిజినెస్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు లక్షల్లో ఆదాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News