National Institute Of Technology Warangal Recruitment 2025: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. అతి త్వరలోనే NITW ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ రిక్రూట్మెంట్ చేపట్టబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇటీవల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ రకాల ఖాళీలకు దరఖాస్తు కోరింది. అయితే ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
వరంగల్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా రీసెర్చ్ అసోసియేట్ & ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అభ్యర్థులకు కావలసిన అర్హతలు ఇతర వివరాలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఇక అభ్యర్థులకు సంబంధించిన వయస్సు పరిమితి వివరాల్లోకి వెళితే.. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు తప్పకుండా 18 ఏళ్లు నిండిన వారై ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతను కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో క్లుప్తంగా తెలిపారు.
ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉన్న మొత్తం 55 ఖాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ఈ నోటిఫికేషన్ లో ప్రకటించారు. కాబట్టి నిరుద్యోగ యువత ఈ జాబ్స్ ని ఫిబ్రవరి 25 లోపు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా కోరారు. ఆసక్తి గలవారు నేరుగా www.nitw.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ దరఖాస్తులకు సంబంధించిన చివరి తేదీని కూడా నోటిఫికేషన్ లో భాగంగా వెల్లడించారు. ఈ జాబ్స్ ని ఫిబ్రవరి 25 లోపు అప్లై చేసుకోవాలని తెలిపారు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక వివరాల్లోకి వెళితే.. అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష లేకుండానే టైపింగ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారని నోటిఫికేషన్ లో వెల్లడించారు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత
అలాగే తప్పకుండా అభ్యర్థులకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా పేర్కొన్నారు. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NITW) రూ.30,000 వరకు జీతం అందించబోతున్నట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం పోస్టుల సంఖ్య 5 కాగా.. దీనిని అప్లై చేసుకునేందుకు ఎలాంటి ఫీజు లేదని వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నేరుగా www.nitw.ac.in వెబ్సైట్ సందర్శించవచ్చు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి