మారుతి సుజుకి దేశంలోని కార్ల కంపెనీల్లో మొదటి స్థానంలో ఉంది. అలాంటి మారుతి కంపెనీకు గట్టి పోటీ ఇస్తున్నది హ్యుండయ్ మాత్రమే. అత్యధిక కార్ల విక్రయాల్లో హ్యుండయ్ రెండవ స్థానంలో ఉంది. హ్యుండయ్ కంపెనీ ఇటీవలే..అత్యంత చౌకైన Grand i10 Nios ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. ఇదొక అద్భుతమైన హ్యాచ్‌బ్యాక్ కారు. ధర తక్కువ, ఫీచర్లు మాత్రం లగ్జరీగా ఉంటాయి.
Grand i10 Nios ధరతో పోలిస్తే మారుతి కంపెనీకు చెందిన చాలా కార్లు పోటీ ఇస్తుంటాయి. కానీ ఈ కారుకు అసలు పోటీ Maruti Suzuki Swift మాత్రమే. మారుతి స్విఫ్ట్ ఇప్పటికీ ఇంకా పాత డిజైన్‌తోనే మార్కెట్లో లభ్యమౌతోంది. కానీ Grand i10 Nios కొత్త ఫీచర్లు, కొత్త లుక్‌తో స్విఫ్ట్‌కు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.
Grand i10 Nios ధర
Grand i10 Nios కారు నాలుగు వెర్షన్లలో వస్తోంది. అవి వరుసగా Era,Magna,Sportz,Asta.ఇందులో మ్యాగ్నా, స్పోర్ట్స్ మోడల్ కార్లు సీఎన్జీ ఆప్షన్లలో కూడా వస్తున్నాయి. ఈ కారు ఎక్స్ షోరూం ధర 5.68 లక్షల నుంచి 8.47 లక్షల రూపాయలుంది. ఇందులో టాప్ మోడల్లో హ్యాచ్‌బ్యాక్ కారులో ఉండే అన్ని ఫీచర్లు లభిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ కారుపై 13000 రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది.
ఫీచర్లు ఏమున్నాయి
ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో పాటు 8 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, రేర్ వెంట్స్‌తో పాటు ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ లైటన్స్ , పుష్ బటన్ స్టార్ట్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఇక ఈబీడీతో పాటు ఏబీఎస్, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ ఛైల్డ్ సీట్ యాంకర్ ఉన్నాయి.
Also read: Apple Watch Ultra: అత్యంత చౌకగా యాపిల్ అల్ట్రా వాచ్, కేవలం 15 వందల రూపాయలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook