What is Pink Tax: సాధారణంగా పన్ను అనేది అందరూ చెల్లిస్తారు. పన్ను చెల్లించడానికి ఎలాంటి తారతమ్యాలు ఉండవు. దేశంలో ఉన్న ప్రజలందరూ పన్ను చెల్లింపుదారులే. కొన్ని పన్నులు మాత్రం కొన్ని వర్గాలు మాత్రమే చెల్లిస్తాయి. అయితే వారూ కూడా ఎలాంటి లింగ బేధం లేకుండా చెల్లిస్తారు. కానీ మహిళలకు ప్రత్యేకంగా ఒక పన్ను విధిస్తున్నారు. ఇది ఎప్పుడో జరుగుతున్నా కొత్తగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పన్ను కేవలం మహిళలకు మాత్రమే విధిస్తుండడంతో దేశంలో కొత్త వివాదం మొదలైంది. మహిళలకు సంబంధించిన వస్తువులకు 'పింక్ ట్యాక్స్' అనేది అమలవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సంజయ్ అరోరా వీడియో తీసి తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది చూసిన బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా షాకయ్యారు.
Also Read: X TV App: ఎలన్ మస్క్ మరో సంచలనం.. యూట్యూబ్‌కు పోటీగా టీవీల్లోనూ 'ఎక్స్' ట్విట్టర్
'లింగ బేధంతో ట్యాక్స్ అనేది సిగ్గుచేటు. పింక్ ట్యాక్స్ వస్తువులను ఎవరూ కొనుగోలు చేయద్దు' అని కిరణ్ మజుందర్ పిలుపునిచ్చారు. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఇన్నాళ్లు ఈ విషయాన్ని గమనించలేదని నెటిజన్లు చెబుతున్నారు. కొత్తగా పింక్ ట్యాక్స్ విధానం అనధికారికంగా అమల్లో ఉందని.. ఇలాంటిది చాలా దారుణమని మహిళలతో పాటు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నుల్లో కూడా వివక్షనా? అని నిలదీస్తున్నారు.
Also Read: IBA Hike: బ్యాంకు ఉద్యోగులకు జాక్‌పాట్.. భారీ మొత్తంలో పెరగనున్న జీతాలు.. శనివారం కూడా సెలవు?
ఆ వీడియోలో ఏమి ఉందంటే..? పురుషులు, స్త్రీలకు ప్రత్యేకంగా వేర్వేరుగా విక్రయించే వస్తువుల ధరల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఒకటే వస్తువు కానీ పురుషులకు తక్కువ ధర.. మహిళలకు ఎక్కువ ధర ఉంటున్నాయి. లిప్ బామ్, రేజర్, స్ప్రే, టీ షర్ట్స్ తదితర వస్తువుల్లో ఒకే బ్రాండ్ ఒకే వస్తువు కానీ మహిళలకు ఎక్కువ ధర, పురుషులకు తక్కువ ధర ఉన్న విషయాన్ని సంజయ్ అరోరా తన వీడియోలో వివరించాడు. ఇలా చాలా వస్తువుల్లో తెలియకుండానే స్త్రీ, పురుషులకు వేర్వేరు ధరలు ఉన్నాయని వివరించారు. మహిళలకు ఎక్కువ ధర ఉండడం విస్మయానికి గురి చేస్తోందని తెలిపారు. ఇది చాలా సిగ్గు చేటు అని చెప్పారు. అయితే ఇలా అధిక ధర ఉండడాన్ని 'పింక్ ట్యాక్స్' అంటారని వెల్లడించారు. ఇది ప్రభుత్వం విధించే పన్ను కాదని చెబుతున్నారు. కానీ ధరల్లో తేడా ఎందుకు ఉంటున్నాయని సర్వత్రా ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇలా సబ్బులు, షాంపూలు, తదితర వస్తువుల్లో ఇలాంటి తేడాలున్నాయని స్పష్టమవుతోంది.
ఈ పింక్ ట్యాక్స్ పేరు ఇప్పుడు దేశంలో కొత్తగా వింటున్నా ప్రపంచంలో చాలానే ఉంది. పింక్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని ఐక్య రాజ్య సమితి పిలుపునిచ్చింది. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలా ధరల్లో వివక్షతో మహిళలపై ఆర్థిక భారం పడుతోందని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలే తక్కువ సంపాదిస్తున్నారు కానీ వారికి అధిక ఇవ్వడం సరికాదని పేర్కొంది. పింక్ ట్యాక్స్ దుమారం రేపడంతో మహిళలంతా అలాంటి వస్తువులను నిషేధించాలని పిలుపునిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter