Tvs Jupiter 110 Cc Scooter 2024 Model: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ టీవీఎస్ మోటార్స్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గతంలో లాంచ్ చేసిన మోడల్స్‌కి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా జూపిటర్ 110 స్కూటర్ గురించి చెప్పనక్కర్లేదు. ఇది సేల్స్‌లో ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ కంపెనీ చాలా రోజుల తర్వాత తమ కస్టమర్స్‌కి గుడ్‌న్యూస్ తెలిపింది. పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జూపిటర్ 110ను అప్‌డేట్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, హీరో మాస్ట్రోకి పోటీగా నిలుస్తోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అద్భుతమైన కొత్త డిజైన్:
టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫ్రంట్ సెటప్‌లో LED లైట్ బార్ డిజైన్‌తో వచ్చింది. దీంతో పాటు ఈ స్కూటర్ బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ స్కూటర్ ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు అద్భుతమైన ఫినిషింగ్‌తో లభిస్తోంది. ఈ స్కూటర్ మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో అందుబాటులో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో బేస్ డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,700తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండవ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ రూ.79,200తో లభిస్తోంది. ఇక చివరి వేరియంట్ డ్రమ్ ఎస్ఎక్స్‌సీ ధర రూ.83,250తో అందుబాటులోకి వచ్చింది.
అద్భుతమైన ఫీచర్స్:
ఈ TVS జూపిటర్ ఫుల్ స్కూటర్ ప్రీమియం ఫుల్-LED లైటింగ్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది ఆటో టర్న్ ఇండికేటర్ రీసెట్‌తో పాటు ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ స్కూటర్‌లో ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ప్రీమియం రంగులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్‌తో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ ఆప్షన్‌తో పాటు వాయిస్ అసిస్ట్ వంటి ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇతర ఫీచర్స్ కూడా లభిస్తాయి.
ఈ జూపిటర్ 2024 స్కూటర్ ప్రీమియం చట్రాలతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు అద్భుతమైన ఇంధన ట్యాంక్, హ్యాండిల్‌బార్లను కలిగి ఉంటుంది. ఇది పెద్ద 113.5cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 9.2Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు ఈ స్కూటర్ iGO అసిస్ట్ ఫీచర్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇక ఈ స్కూటర్ ట్యాంక్ వివరాల్లోకి వెళితే, దీని ఇందన ట్యాంక్ గత స్కూటర్ కంటే 300ML చిన్నగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.