iphone 14 Pro Max Phone : ఐఫోన్ అంటేనే ఖరీదైన ఫోన్ అనే పేరుంది. ఇది సామాన్యుల ఫోన్ కాదు.. కాస్త డబ్బుంటేనో లేక కొంచెం ప్లాన్ చేసుకుంటేనో తప్ప అలాంటి ఫోన్ కొనలేం అనే భావన చాలా మందిలో ఉంటుంది. అలాంటిది ఈ ఐఫోన్ కాస్ట్ గురించి వింటే మరింత షాక్ అవుతారు. ఇది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్. ఇండియాలో ఈ ఐఫోన్ బేసిక్ వేరియంట్ ధర సుమారు రూ. 1 లక్షా 30 వేల నుంచి ప్రారంభం అవుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇదే మోడల్ ఐఫోన్ ఖరీదు మాత్రం అక్షరాల రూ.5 కోట్లు ఉంటుంది.
5 కోట్ల రూపాయల ఐఫోనా అని షాకయ్యారా ? అయినా మోడల్ ఒక్కటే అయినప్పుడు మార్కెట్ లో ఉన్న మిగతా ఫోన్లకు, ఈ ఐఫోన్ కి అంత భారీ తేడా ఎందుకు ? ఇదేమైనా బంగారం, వజ్రాలతో తయారైందా అని అంటారా ? అవును మీ అనుమానం కరెక్టే.. ఇది అలాంటిలాంటి ఐఫోన్ కాదు.. తెల్ల బంగారం వజ్రాలతో తయారు చేసిన ఐఫోన్. తెల్ల బంగారం అంటే తెలుసు కదా.. ఇది బంగారం కంటే విలువైన ప్లాటినంని పోలి ఉంటుంది. మరి ఇదెలా తయారవుతుంది అంటే.. ఇందులో 75 శాతం బంగారం, మిగతా 25 శాతంలో నికెల్, జింక్ మిశ్రమం ఉంటుంది. ఏదైనా తెల్ల బంగారంపై 18 క్యారట్ హాల్ మార్క్ ఉంది అంటే.. అది 75 శాతం బంగారం అనే అర్థం.
అలా ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ లో తెల్ల బంగారంతో పాటు 570 వజ్రాలు పొదిగి ఉన్నాయి. కేవియర్ అనే ఐఫోన్ అండ్ కేస్ డిజైనర్ కంపెనీ ఈ ఐఫోన్ ని తయారుచేసింది. పైగా ఇవి లిమిటెడ్ ఎడిషన్ కూడా. అందుకే ఈ ఐఫోన్ ఖరీదు 6,16,000 అమెరికన్ డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 5 కోట్లు అన్నమాట. పువ్వులతో పాటు వివిధ ఆకారాల్లో వజ్రాలు ఒదిగిపోయేలా ఈ ఫోన్ ని డిజైన్ చేశారు.
ప్రపంచంలోనే ఖరీదైన కార్లలో ఒకటైన లాంబోర్గిని హరకెన్ ఈవో సూపర్ కారు ఖరీదు కంటే కూడా ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ ధరే ఎక్కువ. ఎందుకంటే లాంబార్గిని హరకెన్ ఈవో సూపర్ కారు ధర రూ. 3.70 కోట్లు మాత్రమే.
ఇది కూడా చదవండి : Samsung Galaxy M34 5G: తక్కువ ధరలోనే మిడ్‌లెవెల్ సెగ్మెంట్ ఫీచర్స్ ఉన్న ఫోన్
లిమిటెడ్ ఎడిషన్ కింద కేవియర్ రిలీజ్ చేసిన మూడు ఫోన్లలో ఒకటి ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లో ఒక కుబేరుడు కొనేశాడు. ఈ ఐఫోన్‌ని కొనాలంటే కేవియర్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సిందే. ఈ డైమండ్ స్నోఫ్లేక్ ఐఫోన్‌కి కేవియర్ కంపెనీ ఏడాది పాటు వారంటి కూడా అందిస్తోంది. మొత్తానికి ఈ ఊహించని ధర కారణంగా ప్రస్తుతం ఈ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ ఒక ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది.
ఇది కూడా చదవండి : Oneplus Nord 3 5G, Oneplus Nord CE 3 5G: వన్‌ప్లస్ నుంచి మరో రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK