India post Recruitment 2023: పదవ తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువు సంపాదించే అద్భుత అవకాశం. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2023 ప్రారంభమౌతోంది. ఇప్పటకే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్ధులు త్వరపడండి. ఇండియా పోస్ట్‌లో ఏయే ఉద్యోగాల నియామకాలు జరగనున్నాయి, జీతభత్యాలు ఎలాగుంటాయనే వివరాలు తెలుసుకుందాం..
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2023 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. అన్ని ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.in.లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2023 ముఖ్యమైన అంశాలు
ఇండియా పోస్ట్ నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభమైంది. జూన్ 11 చివరితేదీగా ఉంది. దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే జూన్ 12-జూన్ 14 మధ్యలో సరిచేసుకునేందుకు అవకాశముంటుంది.
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు కావల్సిన వయస్సు 18-40 ఏళ్ల వరకూ ఉండాలి. రిజర్వేషన్ కేటగరీ అభ్యర్ధులకు వయస్సులో మినహాయింపు 3-5 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ పోస్టులకు కావల్సిన విద్యార్ఙత 10 వ తరగతి గణితం, ఇంగ్లీషు తప్పనిసరి అంశాలుగా ఉండి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఉత్తీర్ణుడై ఉండాలి. అదే సమయంలో కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి జీతం 12 వేల నుంచి 29,380 రూపాయల వరకూ ఉంటుంది. ఇక అసిస్టెండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు 10 వేల నుంచి 24, 470 రూపాయులుంటుంది.
ఎలా అప్లై చేయాలి
ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.in.ఓపెన్ చేసి..రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేయాలి. దరఖాస్తు నింపాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. దరఖాస్తులో వివరాలు సరిచూసుకుని నిర్ధారిత ఫీజు చెల్లించాలి. చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆ తరువాత ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపర్చుకుంటే మంచిది.
Also read: Meta Layoffs: మరోసారి షాకిచ్చిన మెటా.. 10 వేల మంది ఉద్యోగులు తొలగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook