Google Pay UPI Circle in Telugu: గూగుల్ పే లాంచ్ చేయనున్న ఈ కొత్త ఫీచర్ యూపీఐ సర్కిల్. ఈ ఫీచర్ ప్రకారం బ్యాంక్ ఎక్కౌంట్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఆశ్చర్యంగా ఉందా. అవును నిజమే. ఈ కొత్త ఫీచర్ అమల్లోకి వస్తే యూపీఐ చెల్లింపుల విస్తృతి మరింత పెరగడం ఖాయం. అసలేంటీ కొత్త ఫీచర్. ఎలా పనిచేస్తుంది. ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.
గూగుల్ పే త్వరలో యూపీఐ సర్కిల్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఫీచర్ ప్రకారం ఒకే బ్యాంక్ ఎక్కౌంట్ నుంచి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం ఈ విధానం ప్రయోగ దశలో ఉంది. కొంతమంది ఎంపిక చేసిన గ్రూప్ సభ్యుల మధ్య ప్రయోగంలో ఉంది. ఈ ఫీచర్ ప్రకారం ఒక వ్యక్తి తన కుటుంబంలో ఎందరికైనా అదే ఎక్కౌంట్ నుంచి యూపీఐ చెల్లింపులు చేసుకునేందుకు అవకాశం కల్పించవచ్చు. అంటే క్రెడిట్ కార్డులో యాడ్ ఆన్ ఫీచర్లా పనిచేస్తుంది.
ఇందులో ప్రైమరీ యూజర్ అంటే బ్యాంకు ఎక్కౌంట్ కలిగిన వ్యక్తి తన ఎక్కౌంట్ వాడుకునేలా ఇద్దరు కుటుంబ సభ్యుల్ని ఆథరైజ్ చేయగలడు. అంటే కుటుంబ సభ్యులు సెకండరీ యూజర్లు అవుతారు. ప్రైమరీ యూజర్..సెకండరీ యూజర్‌కు పూర్తిగా లేదా పాక్షికంగా తన ఎక్కౌంట్‌పై ఆధరైజేషన్ ఇవ్వవచ్చు. అంటే ప్రైమరీ యూజర్ 15 వేల వరకు లిమిట్ ఇచ్చి అందులోంచే సెకండరీ యూజర్ యూపీఐ చెల్లింపులు జరిపేలా చేయవచ్చు. దీనిని ఫుల్ డెలిగేషన్ అంటారు.
అదే పార్షియల్ డెలిగేషన్ ప్రకారం ప్రైమరీ యూజర్ చెల్లింపులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు. సెకండరీ యూజర్ జరిపే ప్రతి చెల్లింపును ప్రైమరీ యూజర్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే సెకండరీ యూజర్ నుంచి పేమెంట్ రిక్వెస్ట్ ప్రైమరీ యూజర్‌కు వెళుతుంది. సెకండరీ యూజర్ చేసిన పేమెంట్ రిక్వెస్ట్‌ను ప్రైమరీ యూజర్ 10 నిమిషాల్లోగా అనుమతించాల్సి ఉంటుంది.
యూపీఐ సర్కిల్లో జాయినింగ్ ఎలా
యూపీఐ సర్కిల్లో జాయిన్ అయ్యేందుకు సెకండరీ యూజర్ తన పోన్ లో గూగుల్ పే యూపీఐ యాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ప్రొఫైల్ సెక్షన్లో క్యూఆర్ కోడ్ ఐకాన్ క్లిక్ చేయాలి. సెకండరీ యూజర్ షేర్ చేసిన క్యూఆర్ కోడ్‌ను ప్రైమరీ యూజర్ స్కాన్ చేసి యూపీఐ సర్కిల్లో చేర్చాలి. సెకండరీ యూజర్ ఎప్పుడూ ప్రైమరీ యూజర్‌కు నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి. సెకండరీ యూజర్‌కు పూర్తి డెలిగేషన్ లేదా పార్షియల్ డెలిగేషన్ ఏదివ్వాలనేది ప్రైమరీ యూజర్ ఇష్టం.
ఫుల్ డెలిగేషన్ ప్రకారం ప్రైమరీ యూజర్..సెకండరీ యూజర్‌కు 5000 రూపాయలు లిమిట్ విధిస్తే అందులోంచే చెల్లింపులు చేసుకోవల్సి ఉంటుంది. దీనికోసం ప్రైమరీ యూజర్ అనుమతి అవసరం లేదు.. ఇందులో డేట్ లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే నిర్ధిష్ట తేదీలోగా యూపీఐ చెల్లింపులకు అవకాశం ఇవ్వడం.
Also read: 8th Pay Commission Updates: 8వ వేతన సంఘంలో ఉద్యోగుల కనీస వేతనం, పెన్షన్ ఎంత ఉంటుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.