Edible Oils Price: గుడ్‌న్యూస్, మరోసారి తగ్గిన వంటనూనె ధరలు, ఎంఆర్‌పిపై 15 శాతం వరకూ తగ్గింపు

Edible Oils Price: మహిళలకు శుభవార్త. వంటనూనె ధరలు మరికాస్త దిగివస్తున్నాయి. ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. ఏ కంపెనీల వంటనూనె ధరలు ఏంతమేరకు తగ్గనున్నాయో పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2021, 06:34 AM IST
Edible Oils Price: గుడ్‌న్యూస్, మరోసారి తగ్గిన వంటనూనె ధరలు, ఎంఆర్‌పిపై 15 శాతం వరకూ తగ్గింపు

Edible Oils Price: మహిళలకు శుభవార్త. వంటనూనె ధరలు మరికాస్త దిగివస్తున్నాయి. ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. ఏ కంపెనీల వంటనూనె ధరలు ఏంతమేరకు తగ్గనున్నాయో పరిశీలిద్దాం

మొన్నటివరకూ పైపైకి ఎగబాకిన వంటనూనెల ధరలు (Edible Oil Prices) ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి ఓ దశలో కిలో వంటనూనె 180 రూపాయల వరకూ చేరుకోగా..ఆ తరువాత క్రమంగా తగ్గి..145-150 రూపాయలకు చేరింది. ఇప్పుడు ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు మరోసారి గుడ్‌న్యూస్ విన్పించాయి. వంటనూనె ధరల్ని మరోసారి తగ్గించాయి. వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఎంఆర్‌పీ పై 10-15 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఫార్చ్యూన్, రుచి సోయా, మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్ , న్యూట్రెల్లా, ఇమామి, బంగే, ఫ్రీడమ్ ఆయిల్స్‌ను ఉత్పత్తి చేసే అదానీ విల్మార్, ఇమామి, జెమినీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అంటే ప్రతి ఆయిల్ బ్రాండ్ ధర కిలోకు 20-25 రూపాయల వరకూ తగ్గనుంది. 

వీటితో పాటు న్యూట్రిలివ్ బ్రాండ్స్, సన్నీ బ్రాండ్స్, గోకుల్ ఆగ్రో, విటా లైఫ్, మెహక్, జైకా బ్రాండ్స్ ధరలు కూడా ఎంఆర్‌పీపై 10-15 శాతం (Edible Oil Companies MRP Reduced) తగ్గనున్నాయి. పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలు తమ ఎంఆర్‌పీని తగ్గించేందుకు అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. రిఫైండ్, క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదిలో పలుమార్లు ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించింది. తాజాగా గత ఏడాది డిసెంబర్ నెలలో 17.5 శాతమున్న ఇంపోర్ట్ డ్యూటీ 12.5 శాతానికి తగ్గింది. 

Also read: Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ ఇయర్​ ఎండ్ సేల్​- స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News