Gold prices may touch $2,000 : బంగారం ధర గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత పది రోజుల్లోనే తులం బంగారం ధర 1000 రూపాయలకు పైగా పెరిగింది. బంగారం ధర ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
డాలర్‌తో (Dollar) రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడంతో పాటు పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు, దేశీయ స్టాక్ మార్కెట్స్ (Stock Markets) పతనమవ్వడంతో... ఇన్వెస్టర్స్ అంతా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరగనుంది.
మరి కొన్ని నెలల్లో బంగారం ధరలు (Gold price) భారీగా పెరుగనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్స్ భారీగా గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొవిడ్ ప్రభావంతో ఇలాగే కొనసాగితే రాబోయే 12 నుంచి 15 నెలల్లో గోల్డ్ రేట్ భారీగా పెరుగుతుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. ఒక ఔన్స్ బంగారం ధర $2,000 పైగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : Mood Of The Nation poll: తెలంగాణలో ఎన్నికలొస్తే.. బీజేపీకి ఎన్ని సీట్లోస్తాయంటే..!
ఒక ఔన్స్ అంటే 28.34 గ్రాములకు సమానం. అంటే అప్పుడు ఒక గ్రాము ధర రూ.5,252కు చేరుకోనుంది. ద్రవ్యోల్బణంతోనే బంగారం ధరలు భారీగా పెరుగుతాయంటూ మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal) నివేదిక స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర (Gold Rate) రూ.48,589 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో ప్రస్తుత గోల్డ్ రేట్ ఒక ఔన్స్ $1840గా ఉంది.
Also Read : IT refunds AY22: రూ.1.59 కోట్ల ఐటీ రీఫండ్స్ చెల్లింపు పూర్తి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook