Tata Ev Vs Citroen EC3: టాటా మోటార్స్ ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. టాటా ఇప్పటికే అత్యంత చౌక ధరలో టాటా టియాగో ఈవీ లాంచ్ చేసింది. టాటా టియోగోకు పోటీగా ఫ్రాన్స్ కంపెనీ మరో ఈవీ కారు లాంచ్ చేయడంతో పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
టాటా టియాగో ఈవీ ధర 8.49 లక్షల నుంచి 11.49 లక్షల వరకూ ఉంది. ఫ్రాన్స్ కంపెనీ సిట్రోయెన్ లాంచ్ చేసిన Citroen eC3 టాటా టియాగో ఈవీకు పోటీగా ఉంది. ఈ కారు 320 కిలోమీటర్ల రేంజ్ కాగా, కేవలం 25 వేల రూపాయలతో బుకింగ్ ప్రారంభించింది. టాటా టియాగో ఈవీ రేంజ్ 315 కిలోమీటర్లుగా ఉంది. మార్కెట్లో ఈ రెండింటికీ మధ్య పోటీ గట్టిగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సిట్రోయెన్ ఈవీలో 29.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఫ్రంట్ యాక్సిల్‌పై ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌కు ఎనర్జీ అందిస్తుంది. ఈ కారు మోటార్ 57 బీహెచ్‌పి పవర్ , 143 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు సామర్ధ్యం పరిశీలిస్తే కేవలం 6.8 సెకన్ల వ్యవధిలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్ట వేగం 107 కిలోమీటర్లుగా ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 320 కిలోమటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.
Citroen eC3 ఫీచర్లు
ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఫీచర్ల గురించి పరిశీలిస్తే..Citroen eC3 టాప్ వేరియంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో పాటు 10.2 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. హైట్ ఎడ్జస్టెబుల్ డ్రైవర్ సీట్, ఫోర్ స్పీకర్ ఆడియో సిస్టమ్ కనెక్టెడ్ కారు టెక్ ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయంలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, ఈబీడీతో పాటు ఎబీఎస్ ఉంటుంది.
ఛార్జింగ్ ఆప్షన్
కొత్త సిట్రోయెన్ ఎలక్ట్రిక్ కారులో రెండు ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి. డీసీ ఫాస్ట్ ఛార్జర్, 3.3 కిలోవాట్ ఆన్‌బోర్డ్ ఏసీ ఛార్జర్ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జర్‌తో దీనిని 57 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఏసీ ఛార్జర్ ద్వారా బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడంలో 10.5 గంటలు పడుతుంది. కంపెనీ బ్యాటరీ ప్యాక్‌పై 7 ఏళ్లు, 1,40 వేల కిలోమీటర్ల వారంటీ, ఎలక్ట్రిక్ మోటార్‌పై 5 ఏళ్లు, 1 లక్ష కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. 3 ఏళ్లకు 1,25 వేల కిలోమీటర్ల వారంటీ అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి