Home Loan EMI: మీ హోమ్‌లోన్ ఈఎమ్ఐ నెలకు 5 వేలు తగ్గే అద్భుతమైన చిట్కాలు ఇవే, ఎలాగంటే

Home Loan EMI: హోమ్‌లోన్ ఈఎమ్ఐతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఈ అప్‌డేట్ మీ కోసమే. ఈఎమ్ఐను తగ్గించుకునే అద్భుతమైన చిట్కాలు చూపిస్తాం. మొన్నటి వరకూ 8-9 శాతమున్న వడ్డీ రేట్లు ఇప్పుడు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2022, 05:30 PM IST
  • హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు, ఈఎమ్ఐ తగ్గించుకునే అద్భుతమైన చిట్కాలు
  • ఈఎమ్ఐపై నెలకు 5 వేల రూపాయల వరకూ తగ్గే అవకాశం
  • గతంలో 9 శాతం పైగా ఉన్న వడ్డీ రేటు..ఇప్పుడు 7 శాతానికి లోపే
Home Loan EMI: మీ హోమ్‌లోన్ ఈఎమ్ఐ నెలకు 5 వేలు తగ్గే అద్భుతమైన చిట్కాలు ఇవే, ఎలాగంటే

Home Loan EMI: హోమ్‌లోన్ ఈఎమ్ఐతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఈ అప్‌డేట్ మీ కోసమే. ఈఎమ్ఐను తగ్గించుకునే అద్భుతమైన చిట్కాలు చూపిస్తాం. మొన్నటి వరకూ 8-9 శాతమున్న వడ్డీ రేట్లు ఇప్పుడు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం.

హోమ్‌లోన్ తీసుకున్నప్పుడు ప్రతినెలా క్రమం తప్పకుండా కట్టాల్సింది ఈఎమ్ఐ. ఉద్యోగస్థులకు ఇది నిజంగా ఇబ్బందే. ఈఎమ్ఐ భారాన్ని ఎలా తగ్గించుకోవాలనే విషయంలో అద్భుతమైన చిట్కాలున్నాయి. ఎందుకంటే గతంలో బ్యాంకులు 8-9 శాతం వడ్డీరేటుకు ఇంటి రుణాలిచ్చేవి. ఇప్పుడు వడ్డీ రేటు 7 శాతం కంటే తక్కువే ఉంది. కొన్ని బ్యాంకులు హోమ్‌లోన్‌‌పై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాయి.

5 వేలు తగ్గనున్న హోమ్‌లోన్ ఈఎమ్ఐ, ఎలాగంటే

మీరు హోమ్‌లోన్ తీసుకుని ఈఎమ్ఐ చెల్లింపులో ఇబ్బంది ఎదుర్కొంటున్నారా. ఇప్పుడు మీకు సూచింటే ట్రిక్స్‌తో మీ ఈఎమ్ఐ దాదాపు 5 వేల వరకూ తగ్గిపోతుంది. మీ పాత హోమ్‌లోన్‌ను ఇతర బ్యాంకుకు బదిలీ చేయడం ద్వారా ఈఎమ్ఐ భారం తగ్గిపోతుంది. దీనికోసం కచ్చితమైన ప్లానింగ్ అవసరం. బ్యాంకు లోన్ బదిలీ ద్వారా ఈఎమ్ఐలో ఏ మేరకు తేదా వస్తుందనే ఓ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఇవాళ్టి నుంచి 4 ఏళ్ల క్రితం అంటే 2017లో హోమ్‌లోన్ తీసుకుని ఉన్నట్లయితే..అప్పుడు బ్యాంకులు హోమ్‌లోన్స్‌పై వసూలు చేసిన వడ్డీ రేటు 9.25 శాతంగా ఉంది. ఇవాళ మరో బ్యాంకుకు బదిలీ చేయడం ద్వారా ఆ వడ్డీ రేటు 7 శాతానికి పడిపోతుంది. అంటే మీ ఈఎమ్ఐలో కూడా తేడా వస్తుంది.

2017లో 30 లక్షలకు హోమ్‌లోన్ తీసుకుంటే..20 ఏళ్ల కాలపరిమితికి 9.25 శాతం వడ్డీ చొప్పున నెలకు 27 వేల 476 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే 2022లో హోమ్‌లోన్ కోసం మరో బ్యాంకుకు బదిలీ చేసే సమయానికి మీ అవుట్ స్టాండింగ్ లోన్ ఎమౌంట్ 26 లక్షలుంది. ఈ క్రమంలో 6.90 వడ్డీ చొప్పున 16 ఏళ్ల వ్యవధికి 26 లక్షల బ్యాలెన్స్‌కు నెలకు 22 వేల 4 వందల రూపాయలు ఈఎమ్ఐ ఉంటుంది. అంటే నెలకు ఏకంగా 5 వేల వరకూ మీ ఈఎమ్ఐ తగ్గిపోయింది. 

16 ఏళ్ల వ్యవధికి కొత్త బ్యాంకుకు బదిలీ అవడం ద్వారా మీరు చెల్లించే వడ్డీ మొత్తం 17 లక్షల 820 రూపాయలు ఉంటుంది. అదే వ్యవధికి పాత బ్యాంకులోనే ఉంటే చెల్లించే వడ్డీ మొత్తం 23 లక్షల 90 వేల 488 రూపాయలుంటుంది. అంటే చెల్లించే వడ్డీ మొత్తంలోనే 6.89 లక్షల తేడా ఉంటుంది. 

Also read: Amazon Oneplus 9RT: రూ.47,000 విలువైన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.24 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News