Ducati India to launch 9 new bikes in 2023: 2022 సంవత్సరం ముగియడంతో.. 2023 సంవత్సరానికి గాను ప్రతి కంపెనీ తమ ప్రణాళికలను రచించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్పోర్ట్స్ బైక్ తయారీదారు తన ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటాలియన్ సూపర్‌బైక్ కంపెనీ 'డుకాటీ' 2023లో ఏకంగా 9 మోటార్‌సైకిళ్ల ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేయనుందట. వీటి ధర రూ.10.39 లక్షల నుంచి రూ.72 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
2023లో డుకాటీ నుంచి 9 మోటార్‌సైకిళ్లు (Upcoming Ducati Bikes in India) భారతీయ రోడ్లపైకి రానున్నాయి. ఈ మోడల్స్‌లో పనిగేల్ V4 R, మాన్స్టర్ SP, డివిల్లే V4, స్ట్రీట్‌ఫైటర్ V4 SP2, మల్టీస్ట్రాడా V4 ర్యాలీ, స్క్రాంబ్లర్ ఐకాన్ 2G, స్క్రాంబ్లర్ ఫుల్ థ్రాటిల్ 2G, స్క్రాంబ్లర్ నైట్‌షిఫ్ట్ 2G మరియు స్ట్రీట్‌ఫైటర్ V4 లాంబోర్ఘిని ఉన్నాయి. వీటన్నింటి ధర భారీగా ఉండనున్నాయి. కనీస ధరనే దాదాపుగా 10.50 లక్షలు ఉంటుంది. ఈ బైక్‌లలో అత్యంత ఖరీదైనది స్ట్రీట్‌ఫైటర్ V4 లాంబోర్గినీ. దీని ధర రూ.72 లక్షలు.
డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర తాజాగా మాట్లాడుతూ... 'గత ఏడాది డుకాటీ కంపెనీ అమ్మకాల వృద్ధి 15 శాతంగా ఉంది. గత ఐదేళ్లలో ఆదాయం కూడా బాగానే ఉంది. అందుకే 2023లో డుకాటీ అమ్మకాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మేము భారతీయ మార్కెట్లో తొమ్మిది కొత్త డుకాటి మోటార్‌సైకిళ్లను విడుదల చేస్తున్నాం. అంతేకాదు రెండు కొత్త డీలర్‌షిప్‌లను కూడా ఓపెన్ చేయనున్నాం' అని చెప్పారు.
ఒక డీలర్షిప్ 2023 జనవరిలో చండీగఢ్‌లో ప్రారంభమవుతుందని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర పేర్కొన్నారు. రెండవ డీలర్షిప్ మొదటి త్రైమాసికంలో అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుందన్నారు. 2023 రెండవ త్రైమాసికం ప్రారంభంలో మాన్స్టర్ ఎస్పిని (రూ. 15.95 లక్షల అంచనా ధర) మార్కెట్లోకి ప్రవేశపెడతామని, ఆ తర్వాత పనిగలే వి4 ఆర్ (రూ.69.99 లక్షలు) ఉంటుందని ఆయన తెలిపారు. అయితే దేశంలో కార్ల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో డుకాటీ బైక్స్ విక్రయాలు ఏ మేర ఉంటాయో చూడాలి.
Also Read: Saturn Transit 2023: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని గ్రహం.. ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవడం పక్కా!
Also Read: Kia Cars New Price: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన కియా.. ఈ కారు కొనడానికి లక్ష అదనంగా చెలించాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.