Cooking Oil Prices: వంట నూనెల ధరలు మళ్లీ తగ్గనున్నాయా... అదే జరిగితే సామాన్యులకు బిగ్ రిలీఫ్..

Edible Oil Prices: దేశంలో వంట నూనెల ధరలు మరోసారి దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం (ఆగస్టు 16) జరగనున్న ఐఎంసీ (ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 16, 2022, 02:50 PM IST
  • నేడు ఐఎంసీ సమావేశం
  • వంట నూనెల ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం
  • రూ.8 నుంచి రూ.15 వరకు తగ్గించే ఛాన్స్
Cooking Oil Prices: వంట నూనెల ధరలు మళ్లీ తగ్గనున్నాయా... అదే జరిగితే సామాన్యులకు బిగ్ రిలీఫ్..

Edible Oil Prices: దేశంలో వంట నూనెల ధరలు మరోసారి దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం (ఆగస్టు 16) జరగనున్న ఐఎంసీ (ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆయిల్ ఉత్పత్తి సంస్థలు, మార్కెటింగ్ కంపెనీలతో చర్చించిన అంశాలపై తాజా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, కందులకు ఎమ్మార్పీ, స్టాక్ పరిమితిపై కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎంత తగ్గే అవకాశం :

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన శుక్రవారం (ఆగస్టు 13) జరిగిన సమావేశంలో సన్‌ఫ్లవర్, సోయా బీన్ ఆయిల్ ధరలపై చర్చ జరిగింది. ఈ వంట నూనెలపై లీటరుకు రూ.8-రూ.15 వరకు తగ్గించాలని కేంద్రం ఆయా ఉత్పత్తి సంస్థలను కోరింది. దీనికి ఆయిల్ ఉత్పత్తి సంస్థలు ఎలా స్పందించాయనేది తెలియరాలేదు. ఒకవేళ తాజా సమావేశంలో ఆయిల్ ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటే సామాన్యులకు బిగ్ రిలీఫ్ లభించినట్లే.

గత సమావేశంలో పామాయిల్ ఫ్యూచర్ ట్రేడింగ్‌పై కూడా చర్చించారు. కంపెనీలు దిగుమతులపై ఆధారపడటం కన్నా దేశీయంగా ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం కూడా సహకారం అందించేందుకు సిద్ధమని తెలిపింది. నేటి సమావేశంలో ఐఎంసీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

గోధుమలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పండగల సమయంలో నిత్యావసరాల ధరలు పెరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం మార్కెట్‌లో సరిపడా స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ఎగుమతులపై నియంత్రణ విషయం కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: DA Hike Updates: డీఏ పెంపుపై కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఎంత పెరగనుందంటే..  

Also Read: Kaushik LM: సినీ పరిశ్రమలో విషాదం.. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News