ఆదానీ గ్రూప్ షేర్లలో గత కొద్దిరోజులుగా భారీ క్షీణత నమోదవుతోంది. అదానీ ఎంటర్ ప్రైజస్ సహా గ్రూప్‌కు చెందిన 3 కంపెనీలు ఇప్పుుడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మూడు కంపెనీలు ఏంటి, ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్ నిఘా అంటే ఏమిటనే వివరాలు తెలుసుకుందాం..
బోంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్ఈలు అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్‌లను ఏఎస్ఎం పరిధి నిఘాలో ఉంచాయి. షేర్ మార్కెట్ నిపుణుల ప్రకారం ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్ అంటే ఏదైనా ట్రేడింగ్ రోజున షేర్ కొనుగోలు, అమ్మకాలకై 100 శాతం ముందస్తు మార్జిన్ అవసరమౌతుంది. దీని ప్రకారం స్టాక్‌ల పెరుగుదల, తగ్గుదలలో భారీ వ్యత్యాసం, మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి, అంతకుముందు రోజు ధరలో వ్యత్యాసం ఎక్కువగా ఉండటం వంటి విషయాలపై నియమాల పాలన అవసరమౌతుంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్ఈ ప్రకారం అదానీ గ్రూప్‌కు చెందిన ఈ మూడు కంపెనీలు ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్ పరిధిలో ఉంచే నిబంధనలకు చేరుకున్నాయి. ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్ ప్రకారం కంపెనీ ఎంపిక పూర్తిగా మార్కెట్ పర్యవేక్షణ ఆధారంగా జరుగుతుందని షేర్ మార్కెట్ నిపుణులు తెలిపారు. దీనిని సంబంధిత కంపెనీకు వ్యతిరేకంగా తీసుకునే చర్యగా భావించకూడదు.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌లో అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చిన తరువాత అదానీ గ్రూప్‌కు చెందిన అన్ని కంపెనీల షేర్లు పతనమౌతున్నాయి. గ్రూప్ మూల కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ విలువ దాదాపు 60 శాతం పడిపోయింది.
Also read: Free Life Insurance Scheme: ఈపీఎఫ్ ఖాతాదారులకు రూ. 7 లక్షల బెనిఫిట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook