Aprillia Tuono 457: కళ్లు చెదిరే ఫీచర్లతో ఎప్రీలియా ట్యూనో 457 లాంచ్ ఫిక్స్, ఎప్పుడు, ధర ఎంతంటే

Aprillia Tuono 457: ఇండియన్ మార్కెట్‌లో త్వరలో మరో సూపర్ బైక్ లాంచ్ కానుంది. ప్రముఖ ఇటలీ కంపెనీ ఎప్రీలియా నుంచి కళ్లు చెదిరే ఫీచర్లు, ప్రత్యేకతలతో ఈ బైక్ రానుంది. ఈ బైక్ గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 14, 2025, 06:43 PM IST
Aprillia Tuono 457: కళ్లు చెదిరే ఫీచర్లతో ఎప్రీలియా ట్యూనో 457 లాంచ్ ఫిక్స్, ఎప్పుడు, ధర ఎంతంటే

Aprillia Tuono 457: ఇటలీ ఆటోమొబైల్ కంపెనీ ఎప్రీలియా నుంచి మరి కొద్దిరోజుల్లో ఎప్రీలియా ట్యూనో 457 లాంచ్‌కు సిద్ధమైంది. ఏకంగా 457 సీసీ ఇంజన్‌తో వస్తున్న ఈ బైక్ ఫీచర్లు, ధర తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం. ఇప్పటికే EICMA 2024లో ప్రదర్శితమైన ఈ బైక్ అందరి అంచనాలు పెంచేసింది. 

ప్రముఖ ఇటలీ బైక్ తయారీ సంస్థ Aprillia నుంచి  Aprillia Tuono 457 ఫిబ్రవరి 17 లేదా 18 తేదీల్లో ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ బైక్ ఇప్పటికే ఇండియాలో ఉన్న ఆర్ఎస్ 457కు నేక్డ్ వెర్షన్. ఈ బైక్ హెడ్‌ల్యాంప్ కింద వింగ్ లెట్స్ ఉంటాయి. ఇందులో వన్ పీస్ హ్యాండిల్ బార్, రియల్ సెట్ ఫుట్ పెగ్స్, ఆర్చ్డ్ సీట్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణతో ఉంటాయి. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్స్‌తో ఉంటుంది. ఇందులో ఆర్ఎస్ 457లో ఉన్నట్టే ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి ప్రత్యేకతలుంటాయి. ఈ బైక్‌లో ప్రీ లోడ్ అడ్జస్టబుల్ యూఎస్ డి ఫోర్క్ సెటప్ ఉంటుంది. వెనుకవైపు కూడా ఆర్ఎస్ 457 బైక్‌లో కన్పించే ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వర్లు ఉంటాయి. చివర రెండు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. 

ఈ బైక్ 457 సిసితో ట్విన్ ఇంజన్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ బైక్ గరిష్టంగా 47 బీహెచ్‌పి పవర్, 43.5 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ఇంజన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ భారతీయ మార్కెట్‌లో 4 లక్షలకు లాంచ్ కావచ్చని తెలుస్తోంది. కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. 

Also read: Netflix Movies List: ఓటీటీ ప్రియులకు గుడ్‌న్యూస్, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల జాతర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News