Purchage Maruti Suzuki Swift only rs 1 Lakh on EMI: కారు కొనాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ అధిక ఖరీదు కారణంగా కారు కొనడం చాలా మందికి కేవలం కలగానే మిగిలిపోతుంది. భారతదేశంలో 'కారు' కొనాలనుకుంటే.. ముందుగా గుర్తుకు వచ్చే పేరు 'మారుతీ సుజుకి'. అయితే ప్రస్తుత కాలంలో కార్లకు కొరత లేదు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒకటి కంటే ఎక్కువ కార్లు బాగా పాపులర్ అయ్యాయి. అయితే మారుతి సుజుకి చాలా కాలంగా భారతదేశంలోని ప్రజల హృదయాలను కొల్లగొడుతోంది.
మారుతి సుజుకికి చెందిన అనేక కార్లు భారత దేశంలో మంచి హిట్ అయ్యాయి. అందులో మారుతి సుజుకి 'స్విఫ్ట్' కూడా ఉంది. స్విఫ్ట్ యొక్క ప్రజాదరణ గత కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా ఉంది. నేటికీ ఈ మారుతి హ్యాచ్‌బ్యాక్ కారు అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 కార్ల జాబితాలో ఉంది. 2023 మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా ఇదే. మారుతీ కంపెనీ మార్చిలో 17,559 యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించింది. మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి మొదలై రూ. 8.89 లక్షల వరకు ఉంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ కారుని మీరు ఢిల్లీలో కొనుగోలు చేస్తే.. బేస్ మోడల్ ధర రూ. 6.71 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు కోసం మీరు కనీసం రూ. 1,00,000 డౌన్ పేమెంట్ చేసి.. మిగిలిన మొత్తానికి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈఎంఐ 7 సంవత్సరాలు పెట్టుకుని.. 8 శాతం వడ్డీ రేటుతో నెలకు సుమారు రూ. 9000 చెల్లించాలి. అయితే వడ్డీ మరియు లోన్ కాలపరిమితిని బట్టి ఈఎంఐ ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు.
Also Read: Lovers Viral Video: వీధిలో యువతితో పెద్దాయన రొమాన్స్.. చివరికి ఏమైందంటే? వీడియో చూస్తే పొట్ట చెక్కలే
మారుతి స్విఫ్ట్ కారు 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 90 PS పవర్ మరియు 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన మైలేజీ కోసం ఐడల్ స్టార్ట్-స్టాప్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంజిన్‌తో పాటు ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన సీఎన్‌జీ కిట్ ఎంపికను కూడా కలిగి ఉంది. దీని పవర్ అవుట్‌పుట్ 77.5PS మరియు 98.5Nm. సీఎన్‌జీలో ఈ కారు మైలేజ్ 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
Also Read: Earth Breathing Video: మనిషిలానే ఊపిరి పీలుస్తున్న భూమి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.