Sharmila Vs RK Roja: షర్మిలపై విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో రోజా స్పందించారు. 'ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదు. తమతో ఉంటున్నదెవరో.. తమ సమస్యల కోసం పోరాడిందెవరో.. వాటిని ఎవరు పరిష్కరించారో ప్రజలకు తెలుసు' అని పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే ఓటు, ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్య ఉంటున్న ప్రజా నాయకుడు జగన్ అని తెలిపారు.
ఏపీ రాజకీయాల్లోకి షర్మిల రాకపై మాట్లాడుతూ..'పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి ప్రజలు ఛీ కొడితే ఇక్కడికి వచ్చి కాంగ్రెస్‌లో చేరి మాట్లాడితే ప్రజలు నమ్మరు' అని రోజా చెప్పారు. రాజన్న రాజ్యం తెస్తానని పావురాల గుట్టలో జగనన్న తన తండ్రికి మాటిచ్చారని.. ఆ మాట కోసం జగన్ వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. కేసులు పెట్టి జైల్లో బంధించిన ఏ రోజు జగన్ తగ్గలేదని వివరించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఏ పార్టీలో విలీనం చేయలేదని రోజా వెల్లడించారు.
రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే అర్హత లేదని రోజా స్పష్టం చేశారు. బాగున్న రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ ఏపీలో అడుగుపెట్టే హక్కే లేదన్నారు. రెండుసార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చి కాంగ్రెస్ అవమానించిందని తెలిపారు. 'వైఎస్సార్ లేని సమయం చూసి ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ రోడ్డుకు ఈడ్చింది. అలాంటి పార్టీలోకి వచ్చి ఎవరు విమర్శలు చేసినా జీరోలే అవుతారు. సామాన్య కార్యకర్తను కూడా జగన్ తన కుటుంబసభ్యుడిగా చూస్తాడు' అని రోజా చెప్పారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వారికి వచ్చే ఎన్నికల్లో సరైన సమాధానం లభిస్తుందని రోజా తెలిపారు.
Also Read: Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook