YS Jagan mass viral video: నిన్నటి రోజు నుంచి తిరుమల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట విషయం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన ఎంతోమంది భక్తులను తీవ్ర మనస్థాపానికి గురైయ్యేలా చేసింది. ఈ విషయం పైన అటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించడానికి వెళ్లారు.. అయితే ఈ సందర్భంలోనే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతికి వెళ్లడం జరిగింది.
అక్కడ జరిగిన ఒక ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
తొక్కిసలాట జరిగిన ఘటన పైన పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా మాట్లాడుతున్నప్పుడు.. ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయి.. అక్కడున్న ప్రజలు పెద్దగా అరుస్తూ.. పవన్ కళ్యాణ్ మాటలకు ఇబ్బంది కలిగించారు.
దీంతో వెంటనే పవన్ కళ్యాణ్.. ఏం జరిగింది? ఏంటా అరుపులు అని.. తన వద్ద విన్న సెక్యూరిటీ తోపాటు , జనసేన ఎమ్మెల్యేని అడగగా.. అందుకు జనసేన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చింది జగన్మోహన్ రెడ్డి సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫేసులో.. రియాక్షన్ మారిపోయినట్టు కనిపిస్తోంది.అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయాన్ని పదే పదే సోషల్ మీడియా వేదికగా కూడా కొంతమంది వైరల్ చేస్తున్నారు.
Drug’s aa bokka ane feels ee video..🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥
Man of Massesss..#YSJagan 💥
Fulll highhhhh istundi..🦁🔥🔥@ysjagan
pic.twitter.com/WLmvyra1Jw— NARUTO (@NarutoReddy17) January 9, 2025
అయితే జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కూడా వైయస్ జగన్ తో సెల్ఫీలు దిగడానికి, ఫోటోలు దిగడానికి పెద్ద ఎత్తున వచ్చినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున జై జగన్ సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించడంతో అక్కడ పరిస్థితి పూర్తిగా వేడెక్కిందని చెప్పవచ్చు.
దీంతో నిన్నటి రోజున సాయంత్రం తిరుపతిలో వీరిద్దరూ ఎదురుపడినంత పని చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ క్షతగాత్రులను సిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించడానికి వెళ్లగా.. ఆ సమయంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిమ్స్ ఆస్పత్రికి వెళ్లడం జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter