Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది వరకే అతని అరెస్ట్‌పై రకరకాలుగా వార్తలు వచ్చాయి.. నేడు అదే జరిగింది. హైదరాబాద్‌లో వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో వంశీ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే, అతనిపై ఇతర కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏ కేసు విషయమై వంశీని అరెస్టు చేశారో తెలియాల్సి ఉంది. ప్రధానంగా టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలోనే అతన్ని అరెస్టు చేశారని పలువురు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అబ్బో.. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌పై ఓ లుక్కేశారా? రూ.2400 లోపే 13 నెలల వ్యాలిడిటీ 790 జీబీ..
టీడీపీ ఆఫీసు దాడిలో 71వ నిందితుడిగా పేరు చేర్చారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వల్లభనేని వంశీ ప్రోద్భలంతోనే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళుతుండగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కొద్దిరోజులుగా వంశీపై నిఘా పెట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వంశీని అరెస్టు చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. టీడీపీ ఆఫీసు దాడి ఘటనలో ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశారు. వంశీ మొబైల్ నంబర్లు కూడా మారుస్తూ వచ్చారు. అతన్ని ట్రాక్ చేస్తున్న పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: రోజ్ వాటర్ ఇలా వాడితే ముఖం కాంతివంతం.. జుట్టుకు రెండురెట్ల బలం..
ఇదిలా ఉండగా 2023 ఫిబ్రవరి 20వ తేదీ రోజు తెలుగు దేశం పార్టీ ఆఫీసుపై దాడి జరిగింది. టీడీపీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆఫీసు ఫర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు అక్కడ ఉన్న పలువురు టీడీపీ నేతలపై దాడి చేసి వాహనాలను సైతం తగులబెట్టారు. అక్కడి సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సత్యవర్థన్ కేసు వెనక్కు తీసుకున్నాడు. పోలీసులు మాత్రం సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కు తీసుకున్నారని పోలీసుల సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. కిడ్నాప్ ఘటనలో కూడా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే 2025 ఫిబ్రవరి 20న ముందుస్తు దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌పై తీర్పు రానుంది. ఇంతలోనే పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా ఈయన అమెరికాలో ఉంటున్నారు. ఇటీవలె హైదరాబాద్ వచ్చారు.
2019లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత వైసీపీతో దోస్తీ చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓడిపోయారు. ఇది కాకుండా ఈ మాజీ ఎమ్మెల్యేపై అక్రమ ఇసుక తవ్వకాల కేసులు కూడా ఉన్నాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలంటూ తెలుగు దేశం పార్టీ కేడర్ డిమాండ్ చేస్తూ వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter