Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం నుంచి శుభవార్త వచ్చేసింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేంది లేదని, ప్లాంట్ పునర్ నిర్మిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఆ వివరాలు మీ కోసం.
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ మరోసారి నినదిస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శుభవార్త అందించారు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు, అధికారులతోనూ, కార్మిక సంఘాల ప్రతినిధులతో నూ విడివిడిగా సమావేశమైన కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయమని స్పష్టం చేశారు. ప్లాంట్‌ను పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 35 వేల కోట్ల అప్పు ఉందన్నారు. ప్లాంట్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నందున మరో మూడు నెలల జీతాల విషయంలో ఇబ్బందులు తప్పవని కార్మికులకు స్పష్టం చేశారు.
తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చాలా సమీక్షలు చేశానన్నారు. విశాఖ ఉక్కు సాధనోద్యమంలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలుసన్నారు. 2013-14 వరకూ పరిశ్రమ పనితీరు బాగానే ఉందన్నారు. ఆ తరువాత నష్టాలొచ్చినట్టు చెప్పారు. 2021లో తొలిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ పైవేటీకరణ అంశం తెరపైకి వచ్చిందన్నారు. ప్రస్తుతం 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తిని లక్ష్యంగా ప్రదాని మోదీ నిర్దేశించారన్నారు. ఇప్పుడు ఆ దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.
Also read: Railway Ticket: రైల్వే కౌంటర్ టికెట్ ఆన్‌లైన్‌లో కేన్సిల్ చేయగలమా, ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి