TDP-JSP Manifesto: ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాల్ని బలోపేతం చేస్తామని, అంతేకాకుండా వైఎస్ జగన్ రద్దు చేసిన పథకాల్ని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రస్తుత పథకాలతో పాటు కొన్ని ఇతర అంశాలకు యనమల నేతృత్వంలోని టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఆమోదించింది.
ఏపీలో వచ్చే ఏడాది 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పట్నించే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పొత్తు ఖరారు చేసుకున్న తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో జనసేన నుంచి ముత్తా శశిధర్, వరప్రసాద్, శరత్ కుమార్ ఉంటే తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు, పట్టాభి, అశోక్ బాబు ఉన్నారు. ఈ కమిటీ నిన్న జరిపిన భేటీలో కీలకమైన కొన్ని అంశాల్ని చర్చించింది. జనసేన ప్రతిపాదించిన 5 అంశాలు, టీడీపీ ప్రతిపాదిత 6 అంశాలపై చర్చించి కమిటీలో తుది నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమంతో కూడిన అబివృద్ధే ప్రధాన ఎజెండాగా ఉంటుందని కమిటీ నిర్ణయించింది.
మొత్తం 11 అంశాలతో తొలి దశ మేనిఫెస్టో సమావేశం ముగిసింది. ఇది మినీ మేనిఫెస్టో అని పూర్తి స్థాయి మేనిఫెస్టో కాదని యనమల రామకృష్ణడు తెలిపారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలౌతుందనే వమ్మకం కల్గించాలని కమిటీ సూచించింది. ఈ మేనిఫెస్టోలో యువతకు నమ్మకం కల్గించేలా ఉపాధి పథకాల ప్రస్తావన ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు 10 లక్షల రాయితీ
బీసీలకు రక్షణ చట్టం
ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు
ప్రస్తుత పథకాల కొనసాగింపు
పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం
ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా
పేదరిక నిర్మూలన
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రక్షణ, సంపన్న ఆంధ్రప్రదేశ్ నిర్మాణం
సంక్షోభం నుంచి బయటపడే విధానాలు
ఆర్ధిక వ్యవస్థ బాగుండేలా ప్రణాళిక రూపకల్పన
Also read; Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook