Jagan Kcr Deal: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఏపీలోని మొత్తం నాలుగు సీట్లు అధికార వైసీపీకి దక్కనుండగా.. తెలంగాణలోని మూడు స్థానాలు టీఆర్ఎస్ పార్టీనే గెలుచుకోనుంది. రాజ్యసభ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అయితే అభ్యర్థుల ఎంపికపై రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ రచ్చ సాగుతోంది. ఏపీలో రెండు స్థానాలను తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు ఇచ్చారు సీఎం జగన్. దీనిపై ఏపీలో రచ్చ సాగుతోంది. ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యలో నిరసనలు సాగుతున్నాయి. ఏపీలో ఎవరూ అర్హులు లేరని తెలంగాణ వాళ్లకు రాజ్యసభ సీట్లు ఇచ్చారా కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలపై తెలంగాణ నేతలు పోరాడుతారా అని నిలదీస్తున్నారు. అటు తెలంగాణలోనూ ముగ్గురు వ్యాపార వేత్తలను పెద్దల సభకు పంపిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇది కూడా వివాదంగా మారింది. ఉద్యమకారులను పట్టించుకోకుండా బడబాబులకు సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులకు ఎంపికకు సంబంధించి టీడీపీ మరో ఆరోపణ చేస్తోంది. హెటిరో గ్రూప్ చైర్మెన్ బండి పార్థసారథి రెడ్డికి ఏపీ సీఎం జగన్ కోటాలో తెలంగాణలో రాజ్యసభ సీటు దక్కిందని టీడీపీ చెబుతోంది. జగన్ తో డీల్ మేరకే పార్థసారథి రెడ్డిని పెద్దల సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ పంపిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. టీఆర్ఎస్, వైసీపీల మధ్య బలమైన బంధం ఉందన్నారు. రెండు పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయనే విషయం రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో తేలిపోయిందన్నారు నరేంద్ర. ఏపీ సీఎం జగన్ కు రాష్ట్ర ప్రయోజనాల కన్న.. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు.. సహ నిందితుల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకో అక్రమాస్తుల కేసులో తనతో పాటు జైలుకు వెళ్లిన వ్యక్తితో పాటు.. ఆ కేసులు వాదించిన లాయర్ కు రాజ్యసభ సీట్లు ఇచ్చారని ధూళిపాళ్ల విమర్శించారు. జగన్ కేసులో మరో నిందితుడిగా ఉన్న హెటిరో పార్థసారథి రెడ్డిని టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు జగనే పంపించారని అన్నారు. జగన్ కోటాలోనే పార్థసారథి రెడ్డి సీఎం కేసీఆర్ రాజ్యసభ సీటు ఇచ్చారని ఆరోపించారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ సొంత ప్రయోజనాలు చూసుకున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. విభజన చట్టం 10వ షెడ్యూల్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా జరగలేదన్నారు. ఏపీకి సంబంధించి సుమారు 20 వేల కోట్లకు పైగా ఆస్తులు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఆ ఆస్తులను కేసీఆర్ కు తాకట్టు పెట్టి.. తన సహ నిందితుడిగా జగన్ రాజ్యసభ సీటు ఇప్పించుకున్నారని నరేంద్ర మండిపడ్డారు. కేసీఆర్ తో డీల్ పెట్టుకున్న జగన్ కు ఏపీ ప్రయోజనాలు అసలు పట్టవని స్పష్టం అయిందన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ లు.. ఏపీ పాలనపై విమర్శలు చేస్తున్నారని.. కాని అదంతా మీడియా కోసం చేస్తున్న డ్రామాలని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఏపీ పరువు పోయేలా తెలంగాణ నేతలు మాట్లాడుతున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. జగన్ తీరును ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు నరేంద్ర.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. తెలంగాణ వ్యక్తులను పెద్దల సభకు పంపించాడనికి నిరసనగా ఏపీలో నిరసన కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. తెలంగాణలోనూ ఉద్యమ సంఘాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా వాయిస్ పెంచుతున్నాయి.
Also Read: Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం, ఇవాళ మే 19 దేశంలో బంగారం ధరలు ఇలా
Also Read: Minister Mallareddy: మరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి.. బావమరిదిపై భూ కబ్జా కేసు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.