Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!

Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్‌ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి. వాంజీనాథన్‌ అనే అడ్వకేట్‌ ఈ తమిళనాడులో ఫిర్యాదు చేశారు.

Written by - Renuka Godugu | Last Updated : Oct 5, 2024, 11:27 AM IST
Pawan Kalyan VS Udhayanidhi: బిగ్‌ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్‌, పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు..!

Case Filed On Pawan Kalyan: లడ్డూ సమస్య బిగ్‌ టర్న్‌ తీసుకుంది. పవన్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా డీఎంకే రానున్న ఎన్నికల్లో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. పవన్‌ కల్యాణ్‌పై డీఎంకే నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. ఏపీ రాజకీయాలు తమిళనాడులో కూడా వ్యాపించాయి. దీనిపై  ఏపీ డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారు చూడాలి.

పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న మతపరమైన వ్యాఖ్యలు మోడీ డైరెక్షన్‌లోనే చేస్తున్నారని అంటున్నారు. పవన్‌ హిందువుల జోలికి వస్తే తాట తీస్తానని వ్యాఖ్యలు చేశారు. మత విధ్వేశాలు రెచ్చగొడుతున్నారని మధురైకి చెందిన అడ్వకేట్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. తిరుమల మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలు పవన్‌ కల్యాణ్‌ చేశారు.

ముఖ్యంగా కేసులో తిరుమల లడ్డూతో సంబంధంలేని ఉదయనిధి ప్రతిష్ఠకు కూడా భంగం వాటిల్లేలా మాట్లాడారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవలె పవన్‌ లడ్డూ కల్తీపై పశ్చాత్తాప దీక్ష చేసిన సంగతి తెలిసిందే, ఆయన తిరుమలలో దీక్ష విరమించారు. ఆ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. సనాతన ధర్మం కోసం తాను ఎలాంటి త్యాగం చేయడానికి అయినా సిద్ధమని పవన్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన డీఎంకే తమ పార్టీ ఎప్పుడూ సనాతన ధర్మంపై తప్పుగా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ పవన్‌ ఈ విధంగా స్పందించారు. 

ఇదీ చదవండి: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే?   

ఇదీ చదవండి:   సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో కూతురు గాయత్రి మృతి..

ఇదిలా ఉండగా సనాతన ధర్మం అనేది వైరస్‌ వంటిది దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ తిరుమలలో మొన్న స్పందించారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ ఈ సమావేశంలో సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరు వారే తుడిచి పెట్టుకు పోతారని పరోక్షంగా స్టాలిన్‌ వ్యాఖ్యలపై ఫైర్‌ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం. అయితే, దీనిపై తమిళనాడు డిప్యూటీ సీఎం మాత్రం వెయిట్‌ అండ్‌ సీ.. వెయిట్‌ అండ్‌ సీ.. అంటూ విలేకరుల సమావేశంలో స్పందించారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు కావడం గమనార్హం.

డీఎంకే నేతలు మాత్రం హిందూ దేవుళ్లను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీడీపీ, బీజేపీలు మతాన్ని స్వప్రయోజనం కోసం వాడుకుంటున్నారు అన్నారు. ఇదిలా ఉండగా అప్పట్లో సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన బహిరంగ వ్యాఖ్యలు కూడా రాజకీయంగా పెనుదుమారం రేపాయి. ఇక తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అందులో వాడిన నెయ్యిలో బీఫ్ ప్యాట్‌, చేప నూనె వినియోగించారని ల్యాబ్‌ టెస్ట్‌కు పంపించారు ఏపీ సీఎం చంద్రబాబు అది నిజమని నిర్ధారన అయింది. ఇదిలా ఉండగా కోర్టు మాత్రం రెండో ఛాయిస్‌ ఎందుకు తీసుకోలేదు, కోట్లాది మంది భక్తులపై ఇది ప్రభావం చూపిందని ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి సిట్‌ కూడా ఏర్పాటు చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News