Pawan Kalyan: అధికారమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ సీట్లు తక్కువైనా కానీ అన్నింటిలో విజయం సాధించాలని తహతహలాడుతోంది. ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. దీనికోసం ముమ్మర ప్రచారం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్ ఈ క్రమంలోనే పార్టీకి భారీ విరాళం ఇచ్చారు. గతంలో భారీ మొత్తంలో విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్ తాజాగా మరో రూ.10 కోట్లు విరాళం ఇచ్చారు. ఎన్నికల కోసం ఈ విరాళం ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్.. టీజర్లో 'గాజు గ్లాస్' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!
పార్టీ విరాళానికి సంబంధించిన చెక్కును పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబుతో కలిసి పార్టీ కోశాధికారి ఏవీ రత్నం బృందానికి అందించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకుల మాదిరి రూ.10 కోట్ల కష్టార్జితాన్ని ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన సాగి్తున్న రాజకీయ పోరాటానికి తనవంతుగా రూ.10 కోట్లు విరాళం ఇచ్చినట్లు వివరించారు. జనసేన పార్టీకి ఎంతో మంది తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఓ మేస్త్రీ రూ.లక్ష విరాళం ఇచ్చారని, వారందరి స్ఫూర్తితో ఈ విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇచ్చిన విరాళం ఎన్నికల్లో పార్టీకి ఎంతో దోహదం చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమైన పవన్ కల్యాణ్ ప్రచార కార్యక్రమాలు ఇంకా ప్రారంభించలేదు. ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం మోదీ, చంద్రబాబుతో కలిసి పాల్గొన్న పవన్ కల్యాణ్ కొన్ని రోజుల్లో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా పవన్ పోటీపై సందిగ్ధత ఏర్పడింది. అక్కడి టీడీపీ నియోజకవర్గ నాయకుడు పవన్ పోటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పోటీకి స్థానిక టీడీపీ నాయకులు సహకరిస్తే పవన్ ముందుకు వెళ్లనున్నారు. లేకపోతే మళ్లీ భీమవరం, గాజువాకలో ఎదురైన పరాభవం ఇక్కడ తప్పదని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter