Niti Aayog: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ నీతి ఆయోగ్ సభ్యుల బృందం పర్యటించనుంది. ఢిల్లీ నుంచి విజయవాడ విమానాశ్రానికి చేరుకున్న నీతి ఆయోగ్ సభ్యులకు ఏపీ ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు.
ఏపీ పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్(Niti Aayog)సభ్యుల బృందం విజయవాడకు చేరుకుంది. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులకు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా కృష్టా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించనుంది. ఆ తరవాత అంటే మద్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో నీతి ఆయోగ్ బృందం భేటీ కానుంది. సాయంత్రానికి వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాలు, వివిధ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, విద్యాసంస్థల ప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులతో సమావేశ ఉంటుంది.
మరోవైపు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ప్రభావంతో దెబ్బతిన్న కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. ఇప్పటికే వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన వైఎస్ జగన్..క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. బాధితుల్ని పరామర్శిస్తారు. తొలిరోజు కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటన ఉంటుంది. రెండవరోజు నెల్లూరులో పర్యటించనున్నారు.
Also read: Cyclone Alert: ఏపీకు మరోసారి తుపాను హెచ్చరిక, ఉత్తరాంధ్రకు భారీ వర్షాల ముప్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook