AP MLA Quota MLC Elections: ఏపీలో నేడే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ లో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగిసిన అనంతరం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఏడుగురు వైసీపీ అభ్యర్థులు, ఒకరు టీడీపీ అభ్యర్థి బరిలో నిలిచారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నీ రాజకీయ నేతల హడావుడితో నిండిపోయాయి.
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు చుట్టూనే ఈ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది. గెలిచేందుకు తగినంత మెజార్టీ లేకపోయినప్పటికీ టీడీపీ బరిలోకి దిగిన నేపథ్యంలో తమ వైపు నుంచి ఒక్కరు కూడా చేజారిపోకుండా ఉండేందుకు వైసీపీ ఇప్పటికే విప్ జారీచేసింది
ఇదిలావుంటే, టీడీపీ మాత్రం తమకు క్రాస్ ఓటింగ్ పడుతుందనే ధీమా వ్యక్తంచేస్తోంది. ఇప్పటికే క్రాస్ ఓటింగ్ కోసం టీడీపీ నేతలు గట్టిగా లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, టీడీపీ లాబీయింగ్ కి ఎమ్మెల్యేలు దొరక్కుండా ప్రజాప్రతినిధులను ప్రాంతాలు, జిల్లాలు వారీగా బృందాలుగా విభజించి వారిని మానిటర్ చేసే బాధ్యతలను కీలక నేతలకు అప్పగించినట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం ఓటింగ్ ఫలితం తేలే వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Chandrababu Sketch: పట్టభద్రుల ఎమ్మెల్సీలు మాత్రమే కాదు.. అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ కూడా గెలిచేలా బాబు స్కెచ్?
ఇది కూడా చదవండి : Sajjala Comments on MLC Results: వచ్చిన ఓట్లన్నీ TDPవి కావు.. మేము హెచ్చరికగా భావించడం లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK