Minister Gudivada Amarnath EGG Story: హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ గ్రాండ్‌గా ముగిసింది. ఈ పోటీల్లో జీన్ ఎరిన్ వెర్గ్నే విజేతగా నిలిచారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీని అందించారు. ఆ తరువాత స్థానాల్లో నిక్ క్యాసిడీ, సెబాస్టియన్ నిలిచారు. రేస్‌ను వీక్షించేందుకు క్రీడా, సినీ తారలు భారీగా హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు రేస్ మొదలవ్వగా.. దాదాపు గంటన్నరపాటు సాగింది. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో ప్రపంచస్థాయి రేసర్లు రయ్ రయ్‌మంటూ కార్లతో దూసుకెళ్లారు. ఇక ఈ పోటీలను వీక్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌ను కలిసి మాట్లాడారు.
పోటీలు పూర్తయిన అనంరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిచడం గర్వకారణమని అన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ నిర్వహించడంతో ప్రపంచ పటంపై తెలుగువారి ముద్ర పడబోతుందన్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా.. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం మంచి విషయమన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, నిర్వాహకులను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పారు.
Interacted with Telangana IT & Industries minister @KTRBRS at India's first Formula E World Championship @GreenkoIndia
#HyderabadEPrix pic.twitter.com/T9kHyK1zVT
— Gudivada Amarnath (@gudivadaamar) February 11, 2023
రాబోయే రోజుల్లో ఏపీలో ఈ రేసింగ్ పోటీలు చూడబోతున్నామా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంత్రి గుడివాడ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు.. కానీ, కోడి.. కోడిని పెట్టలేదు కదా..? కోడి గుడ్డు పెట్టాలి.. మళ్లీ దాన్ని పొదిగించాలి. మళ్లీ దాన్ని తీసుకువచ్చి కోడి కింద తయారు చేయాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోడి గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చడానికి టైమ్ పడుతుంది. హైదరాబాద్ అంటే కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలు నిర్మించింది కాదు కదా..? హైదరాబాద్‌ను తెలంగాణ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలిసి ఉమ్మడిగా నిర్మించుకున్న నగరం ఇది. ఈస్థాయికి చేరడం ఓ తెలుగువాడిగా గర్వపడుతున్నాం. అభినందిస్తాం. దీనికి దీటుగా విశాఖపట్నం రాజధాని అభివృద్ధి చెందాలని భావిస్తాం. ఆ దిశంగా ముందుకెళ్తాం..' అని ఆయన చెప్పారు.
Also Read: Ravindra Jadeja: రవీంద్ర జాడేజాకు ఫైన్.. ఆ వీడియోలో ఏం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి