CM Jagan Tour: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయాతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు సాగిన భేటీలో కీలక అంశాలపై చర్చించారు. ఏపీకి 13 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని ఆయన కోరారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన క్రమంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందన్నారు సీఎం.
మంగళవారం ప్రధాని మోదీ,పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర పెద్దలను ఆయన కోరనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధుల మంజూరు అంశాన్ని సీఎం ప్రస్తావించనున్నారు. ప్రధానంగా పోలవరం అంశాన్ని ప్రధాని మోదీ, జల్‌శక్తి మంత్రి షెకావత్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పోలవరం పనులను వేగవంతం చేసేలా చూడాలని ఇప్పటికే ఆర్థిక, ఇతర శాఖలను కేంద్రం ఆదేశించింది. ఇటీవల జరిగిన అపెక్స్ సమావేశంలో కీలక ఆదేశాలు సైతం ఇచ్చింది.
ఇటీవల ఏపీ(AP) 26 జిల్లాల రాష్ట్రంగా ఏర్పడింది. ఈ విషయాన్ని సైతం కేంద్ర పెద్దల వద్ద ఉంచే అవకాశం ఉంది. రాష్ట్ర భౌగోళిక అంశాలను వివరించనున్నారు. జోన్ల అంశాన్ని కూడా ప్రధాని మోదీ(PM MODI) దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు సీఎం ఢిల్లీ టూర్‌పై విపక్షాలు పెదవిరుస్తున్నాయి. తన వ్యక్తగత విషయాల కోసమే హస్తినకు వెళ్లాలని విమర్శిస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతోందని స్పష్టం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసమే ప్రధాన ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని తేల్చి చెబుతున్నారు.
Also read:MS Dhoni CSK Captain: బ్రేకింగ్ న్యూస్.. చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ!
Also read:Prashanth Kishore: బీజేపీని ఓడించే చిట్కా చెప్పిన ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ ఏమంటారో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook