Srikakulam Politics: అచ్చెన్న ఇలాకాలో.. తెలుగుతమ్ముళ్ల వార్‌!

Srikakulam Politics: ఆ నియోజక వర్గంలో రాజకీయాలు బలేరంజుగా ఉంటాయి..! ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో అత్యంత పెద్ద నియోజక వర్గంగా పేరొందిన నియోజక వర్గంలో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే..! అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ,సమస్యల పరిష్కారానికి పోటీ పడాల్సిన నేతలు వర్గపోరుతో ఫైట్ చేస్తుంటారు..! ఇప్పుడు అధికార పార్టీలో సైతం ఇదే సంస్కృతి కొనసాగుతూ వస్తోంది..! ఒకే పార్టీ కి చెందిన ఇద్దరు ముఖ్య నేతల మధ్య పోరు కూటమి కార్యకర్తలను ఇరుకున పడేస్తోంది..!

Written by - G Shekhar | Last Updated : Jan 15, 2025, 12:00 PM IST
Srikakulam Politics: అచ్చెన్న ఇలాకాలో.. తెలుగుతమ్ముళ్ల వార్‌!

Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు, జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణ మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమంటోంది. దాదాపు 5 దశాబ్ధాలపాటు పాతపట్నంలో చక్రం తిప్పిన కలమట మోహన్ రావు.. ఆయన కుమారుడు కలమట వెంకటరమణను కాదని.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మామిడి గోవిందరావుకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, ఇతర వ్యవహారాల్లో ఎమ్మెల్యే అనుచరుల పెత్తనం పెరిగిపోవడంతో జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది..

శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం ఐదు మండలాలను కలిపి అతిపెద్ద నియోజకవర్గంగా గుర్తింపు సాధించింది. అలాగే ఇక్కడి రాజకీయాలు సైతం చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇటీవల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్ధిగా మామిడి గోవిందరావు గెలిచారు. దీంతో ఐదు దశాబ్ధాలుగా నియోజకవర్గంలో చక్రం తిప్పి 7 సార్లు గెలిచిన తండ్రి కుమారులు కలమట మోహన రావు, కలమట వెంకటరమణలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. అయితే ఎన్నికల సమయంలో కలమట వెంకటరమణకు నచ్చజెప్పి టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని చంద్రబాబు కట్టబెట్టారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మామిడి గోవిందరావు ఎభారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయన పాతపట్నం నియోజకవర్గంలో పాగా వేశారు.. కానీ ఇద్దరు నేతల మధ్య ఉన్న దూరం మాత్రం తగ్గలేదు. పైగా రోజురోజుకి మామిడి గోవిందరావు, కలమట వెంకటరమణ ల మధ్య గ్యాప్ దుమారాన్ని మరింత రేపేలా చేస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే గోవిందరావు అనుచరుల ఒకటి రెండు తప్పిదాలను కలమట వెంకటరమణ ప్రత్యక్షంగా ఎత్తి చూపి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అదే విధంగా టీడీపీ కార్యకర్తలకు ఇరువురు నేతలు మధ్య వివాదాలు ఇరుకున పడేస్తున్నాయి. కలమట వెంకటరమణ వద్దకు వెళ్లిన వారు తన వద్దకు రావాల్సిన అవసరం లేదని బల్ల గుద్ది మరి ఎమ్మెల్యే గోవిందరావు తెగేసి చెప్పేస్తున్నారట. అయితే ఈ విషయం తెలిసి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే తీరుపై అంతేత్తున ఎగిరి గంతెస్తున్నాడట..

మరోవైపు ఎమ్మెల్యే మామిడి గోవిందరావును ఎలాగైనా బద్నాం చేసేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ ఎదురుచూస్తున్నాడట. దీంతో ఐదు దశాబ్దాల కాలం కలమట ఫ్యామిలీతో ఉన్న వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. అటు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఈ వివాదాన్ని పరిష్కరించలేక చేతులెత్తేసినట్టు సిక్కోలు జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద పాతపట్నం అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కు టీడీపీ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందన్న విషయం రాష్ట్ర పార్టీ పెద్దల వరకు వెళ్ళినా పరిష్కారం చూపడం లేదట. దాంతో కార్యకర్తలు అడ కత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారని సమాచారం..

Also Read: Turmeric Board: పసుపు రైతులకు 'సంక్రాంతి' కానుక... నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం

Also Read: Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి భారీ ఊరట.. బెయిల్‌పై విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News