Telugu desam party: టీడీపీ ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పుతున్నారా..?

Telugu desam party :క్రమశిక్షణకు మారుపేరు ఐనా టీడీపీ పార్టీలో కొందరు నేతలు కట్టుతప్పుతున్నారా..?  సీఎం చంద్రబాబు నాయుడుకు కొందరి ఎమ్మెల్యేల తీరు పెద్ద తలనొప్పిగా మారిందా..?  నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారా....? చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా..? టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు..? అసలు వారి సమస్య ఏంటి..?  

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Oct 17, 2024, 03:49 PM IST
Telugu desam party: టీడీపీ ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పుతున్నారా..?

Telugu desam party: తెలుగు దేశం పార్టీ కీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఎంతో మంది నేతలను తెలుగు రాష్ట్రాలకు అందించిన ఘనత టీడీపీదీ. అలాంటి టీడీపీ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుంది. అలాంటి టీడీపీలో ఇప్పుడు కొందరు నేతల తీరు పార్టీకీ పెద్ద తలనొప్పిగా మారుతన్నట్లు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు చెప్పిందే వేదం. ఎంత పెద్ద సీనియర్ నేత ఐనా చంద్రబాబు మాట జవదాటడు. ఇది టీడీపీలో ఎప్పటి నుంచో కొనసాగుతన్న సంప్రదాయం.అలాంటి టీడీపీలో ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనపిస్తున్నాయి. 

ఇటీవల జరుగుతున్న పరిణామాలు వాటిని బలపరుస్తున్నాయి. ఇసుక, మద్యం టెండర్ల విషయాల్లో కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు మాటను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. అధికారంలోకి వచ్చీ రాగానే కొందరు ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారని టీడీపీలో ప్రచారం జరుగుతుంది. ప్రతి పనిలో కమీషన్ ఇవ్వాల్సిందే అని ఓపెన్ గా ఎమ్మెల్యేలు  చెబుతున్నారని ఇది మంచి సంప్రదాయం కాదని గతంలో టీడీపీలో ఎప్పుడూ ఇలాంటి పోకడలు లేవని చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలవాల్సిందే అన్నట్లుగా ఎమ్మెల్యేలు ఉన్నారని టాక్నడుస్తుంది.

ఏపీలో మద్యం టెండర్లు, ఇసుక అంశాలు చంద్రబాబుకు , కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయని సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇసుక, మద్యం విషయాల్లో పార్టీకీ చెడ్డ పేరు తెచ్చేలా కొందరు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని పార్టీ నేతలు అనుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుకు కూడా సమాచారం తెప్పించుకున్నారని పార్టీలో టాక్ నడుస్తుంది. ఇటీవల పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఇదే విషయంపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని నేతలు చెబతున్నారు. పార్టీకీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతలు ఎవ్వరూ నడుచుకున్నా వారిపై చర్యలు తప్పవని చంద్రబాబు నేతలను హెచ్చరించారు.

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి  చెందిన కొందరి ఎమ్మెల్యేల తీరు అతిగా ఉందని టీడీపీలోనే చర్చ జరుగుతుంది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి,  సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం , ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియల తీరు  తీవ్ర వివాదాస్పదం అయ్యింది. వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇసుక విషంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతలను సైతం బహిరంగంగానే బెదిరించడం సంచలనంగా మారింది. జేపీ ప్రభాకర్ రెడ్డి తీరును నియోజకవర్గ నేతలే తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే అయి ఉండి ఇలా బెదిరించడం ఏంటని టీడీపీ శ్రేణులే ప్రశ్నించాయి. ఈ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం. 

ఇక మరో ఎమ్మెల్యే ఆదిమూలంది మరో కథ. ఈయన గారి రొమాన్స్ వీడియో అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఏకంగా ఎమ్మెల్యేపై  లైగింక వేధింపులకు గురి చేశారని  సొంత పార్టీ మహిళా కార్యకర్తే ఫిర్యాదు చేయడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఒక వైపు చంద్రబాబు విజయవాడ వరదల సహాయక చర్యల్లో తలామునకలై ఉండగా ఈ వ్యవహారం పార్టీకీ పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఎమ్మెల్యే ను పార్టీ నుంచి  బహిష్కరణ చేసే వరకు వెళ్లింది. అటు తర్వాత ముఖ్య నేతల ప్రమేయంతో ఆ వ్యవహారం నుంచి బయటపడ్డారు. ఇది మరవక ముందే మరో మహిళతో ఆదిమూలం మాట్లాడిన రొమాంటిక్ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దీంతో ఆదిమూలం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే అయి ఉండి ఇదేమీ పాడు బుద్ది అంటూ సొంత పార్టీ నేతలే ఆదిమూలంను తిట్టిపోస్తున్నారు.

ఇక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియది అదే తీరు. ఇటీవల విజయ డైరీ కార్యాలయంకు వెళ్లిన అఖిల ప్రియ సొంత మామ, ప్రతిపక్ష పార్టీకీ చెందిన నేతతో ఫోన్ లో మాట్లాడిన తీరు సెన్షేషన్ గా మారింది. బహిరంగంగానే ప్రతిపక్ష నేతకు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. భూమా అఖిల ప్రియ కొంత దూకుడు తగ్గించుకుంటే మంచిదని టీడీపీలోనే గుసగుసలు పెట్టుకుంటున్నారు..ఇక అనంతపురంలో మద్యం విషయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  మధ్య కూడా చిచ్చు రేగింది. మంత్రిని సైతం  లెక్క చేయకుండా  సొంత పార్టీ నేతలకే ఎమ్మెల్యే వార్నింగ్ కు ఇవ్వడం కలకలం రేపుతుంది.

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ తీరును సమర్థించుకుంటున్నారు.గత ఐదేళ్లుగా రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని వాటన్నింటికి ఇప్పుడు లెక్క సెట్ చేసుకుంటున్నామని వారు చెబుతున్నారు. ఎవ్వరేమనుకున్నా సరే  ఇకపైనా కూడా తాము ఇలాగే ఉంటామని. మా నియోజకవర్గంలో తమకు తెలియకుండా ఏమీ జరిగినా ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. అన్నీ తెలిసి ఎవరైనా మా నియోజకవర్గాల్లో వేలు పెట్టాలనుకుంటే వదిలేది లేదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇది సొంత పార్టీ నేతలకు కూడా వర్తిస్తుందని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

ఈ ఎమ్మెల్యేల తీరు ఇలా ఉంటే మరి కొందరి నేతల వ్యవహారం కూడా పార్టీకీ నష్టం కలిగేలా ఉంటుంది. ముఖ్యంగా ఇసుక, మద్యం టెండర్ల విషయంలో నేతలు కంట్రోల్ తప్పుతున్నారనే విమర్శలు  ఉన్నాయి. తమ నియోజకవర్గంలో తాము చెప్పిందే నడవాలన్నట్లుగా ప్రవర్తిస్తుండడం చంద్రబాబుకు పెద్ద హెడేక్ గా మారింది. ఒక వైపు సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తుంటే మరోవైపు ఎమ్మెల్యేల తీరు చంద్రబాబుకు తెగ చికాకు తెప్పిస్తున్నట్లు టీడీపీ ఇన్నర్ సర్కిల్ టాక్ నడుస్తుంది. ఎమ్మెల్యేలు ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం పార్టీకీ డ్యామేజ్ తప్పదని కొందరు సీనియర్లు అంటున్నారు. ఇలాంటి కాంట్రవర్షల్ ఎమ్మెల్యేలను చంద్రబాబు కంట్రోల్ చేయాలని పార్టీ సీనియర్ల నుంచి వినబడుతుంది.

Also Read: Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News