Chandrababu on CM Jagan: చిత్తూరు జిల్లా మదనపల్లెలో మినీమహానాడును ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో చేపట్టింది. భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజా సొమ్మును జగన్ ప్రభుత్వం దండుకుంటోందని మండిపడ్డారు. అమ్మ ఒడి బూటకం..ఇంగ్లీష్ మీడియం ఒక నాటకమని విమర్శించారు. పాలనంతా అవినీతిమయం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం చేస్తున్నామని..ఎక్కడ చూసినా సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. ఇది ఏంటని ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం చేయలేదని చెప్పారు. తాము తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసే వారా అని ప్రశ్నించారు. ఆ రోజు ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి..ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక సామాన్యులపై భారం మోపిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను మరోసారి పెంచారని గుర్తు చేశారు. మూడేళ్ల పాలనలో నాసిరకం మందు బ్రాండ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. కొత్తగా వృత్తి పన్ను తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి..నిరుద్యోగులను మోసం చేశారన్నారు.
Also read:Booster Dose: దేశంలో కరోనా ఉధృతి..కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook