Mopidevi Venkata Ramana Likely to Join in TDP: అసెంబ్లీ ఎన్నికల తరువాత వైసీపీ పరిస్థితి పుండు మీద కారం చల్లినట్లు అవుతోంది. ఇప్పటికే కొందరు కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిపోగా.. మరికొందరు బహిరంగంగా పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో కాస్త ఊరట చెందిన వైసీపీకి అంతలోనే ఊహించని తగలనుంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న ఎంపీ మోపిదేవి వెంకట రమణ పార్టీని వీడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రేపు ఆయన వైసీపీకి రాజీనామా చేసి.. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది.
Also Read: Bengal Bandh: రణరంగంగా మారిన కోల్ కతా.. బీజేపీ కీలక నేతపై దుండగుల కాల్పులు.. వీడియో వైరల్..
మోపిదేవి వెంకట రమణ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిలో కూడా ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు ఫిక్స్ అయిన ఆయన.. గురువారం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాజ్యసభ సభ్యత్వంతోపాటు వైసీపీకి ఆయన రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. మోపిదేవి రాజీనామాతో వైసీపీ అధిష్టానం డైలామాలో పడిపోయింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోపిదేవి వెంకటరమణ సీనియర్ రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ రెండు ఎన్నికల్లో ఓడిపోగా.. 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రేపల్లె నియోజకర్గం కొత్తగా ఏర్పాటు కావడంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కోల్పోవడంతో 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019లో పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా మోపిదేవి ఓడిపోయినా.. జగన్ మంత్రిగా ప్రమాణం చేయించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఆ తరువాత అనూహ్య పరిమాణాలు చోటు చేసుకున్నాయి. మంత్రి, ఎమ్మెల్సీ పదవులను వదులుకుని ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో రేపల్లె ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని భావించినా.. టికెట్ దక్కలేదు. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన సైలెంట్ అయ్యారు. తాజాగా ఎంపీ పదవితోపాటు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.