Hindupuram: హిందూ'పురం' కైవసం.. వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్!

Balakrishna Big Shock To YS Jagan With Hindupur: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అదిరిపోయే దెబ్బ కొట్టారు. తనకు కొరకరాని కొయ్యగా ఉన్న హిందూపూర్ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడంతో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 3, 2025, 05:16 PM IST
Hindupuram: హిందూ'పురం' కైవసం.. వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్!

TDP Gains Hindupuram Chairman: ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు పురపాలికల్లో మరింత పరిస్థితి దయనీయంగా మారింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్‌సీపీ కనుమరుగవుతోంది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలోనూ 'ఫ్యాన్‌' రెక్కలు ఊడిపోయాయి. హిందూపురం మున్సిపల్‌పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడంతో మాజీ సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌గా రమేశ్‌ కుమార్‌ ఎన్నికలో సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుబాటు చేయడంతో వైసీపీకి మింగుడుపడని అంశంగా మిగిలింది.

Also Read: Nara Lokesh: 'ఇది జగన్‌ ప్యాలెస్‌ కాదయ్యా.. ఎందుకింత బందోబస్తు'.. లోకేశ్‌ ఆన్‌ ద ఫైర్‌

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో దశాబ్దంన్నర పాటు బాలకృష్ణ ఏలుబడి నడుస్తోంది. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ బలంగా ఉంది. హిందూపురం మున్సిపల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలుబడిలో ఉండేది. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మున్సిపాలిటీ వైసీపీలో ఉండడంతో కొంత రాజకీయ ఇబ్బందులతోపాటు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం ఉండేది.

Also Read: Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌

కాలం గిర్రున తిరిగి ఇప్పుడు హిందూపురం రాజకీయం పూర్తిగా మారిపోయింది. హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఈసారి హిందూపురం నియోజకవర్గాన్ని మొత్తం తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్‌ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన చైర్మన్‌ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ఆఖరకు టీడీపీ అభ్యర్థి డి రమేష్ కుమార్ ఎన్నికయ్యారు.

బలాబలాలు
హిందూపురం మున్సిపాలిటీ సమావేశానికి మొత్తం 38 కౌన్సిలర్లు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైర్మన్ అభ్యర్థిగా రమేశ్‌ కుమార్‌కు 21 మంది కౌన్సిలర్లతోపాటు ఎంపీ బీకే పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతు తెలిపారు. మెజార్టీ లభించడంతో చైర్మన్‌గా అతడి ఎన్నికను ఎన్నికల అధికారిగా ఉన్న ఆర్డీఓ  ఆనంద్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. 6వ వార్డ్ కౌన్సిలర్ డీఈ రమేశ్‌ కుమార్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు తెలిపారు. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి లక్ష్మికి 14 మంది కౌన్సిలర్లు మాత్రమే మద్దతునివ్వడంతో ఆ పార్టీ ఓడిపోయింది.

తెలుగుదేశం పార్టీ హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన రమేశ్‌ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో హిందూపురం మున్సిపాలిటీకి రూ.వందలాది కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్లు రోడ్ల విస్తీర్ణ పనులను శరవేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News