Minister Roja Comments On Gannavaram issue: తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై ఏపీ రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖా మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గన్నవరంలో టీడీపీ నాయకులే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణం అవుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు కేరాఫ్ అడ్రస్ అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను వాడుకోవడం తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమేనని.. అందుకే ఇప్పుడు కూడా పోలీసులపై అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు అని అన్నారు.
ఏపీలో చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఇక ఒక్క సీటు కూడా రాదు. ఆ విషయం తెలిసే చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ చంద్రబాబును మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికే సీఎం వైఎస్ జగన్ నిత్యం కృషి చేస్తున్నారని.. ఈజ్ ఆఫ్ డూయింగ్, జిఎస్టిపిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే అది మా ముఖ్యమంత్రి కృషి వల్లే సాధ్యమైందని అన్నారు. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 14 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ వారికి సామాజిక న్యాయం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇలా కుల రాజకీయాలు చేసి తమ నాయకుల చేత ముఖ్యమంత్రిని తిట్టిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రధాని మోదీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రశంసిస్తున్నారని.. అది చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రిని పనికిమాలిన వెధవలు, పైసాకు పనికిరాని వ్యక్తులతో తిట్టిస్తున్నారు అని టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేస్తోన్న ముఖ్యమంత్రి ఏమైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదని మందలించిన మంత్రి రోజా.. ఇకపై టిడిపి కార్యకర్తలకు నోరులేస్తే మేం చేతులతో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి : SRK Follows 6 People: షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న ఆ ఆరుగురు ఎవరో తెలుసా ?
ఇది కూడా చదవండి : UPI Transactions News: యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook