AP Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయం ఏమైంది. ఇప్పుడీ ప్రశ్నే సర్వత్రా విన్పిస్తోంది. మండలిని రద్దు చేయాలన్న నిర్ణయంపై అధికార పార్టీ ఇంకా కట్టుబడి ఉందా లేక వెనక్కి తగ్గనుందా. వైసీపీ నేతల వ్యాఖ్యలు దేనికి సంకేతాలిస్తున్నాయి.
ఏపీలో శాసనమండలిని రద్దు(Ap Legislative Council Abolition) చేస్తూ శాసన సభలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది ప్రభుత్వం. గత ఏడాది జరిగిన వ్యవహారమిది. అప్పట్నించి ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో పడింది. శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా వచ్చింది. అప్పట్లో శాసన మండలిలో ప్రతిపక్షం తెలుగుదేశం బలం ఎక్కువగా ఉండేది. ఫలితంగా అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందిన బిల్లుల్ని టీడీపీ మండలిలో అడ్జుకునేది. ముఖ్యంగా సీఆర్డీఏ రద్దు బిల్లు, మూడు రాజధానుల బిల్లు, ఇంగ్లీష్ మీడియం బోధన వంటివి ప్రధానంగా ఉన్నాయి.ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) శాసన మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత కరోనా సంక్షోభం కారణంగా పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా జరిగిన పరిస్థితి లేదు. దాంతో ఈ అంశం పార్లమెంట్లో పెండింగ్‌లో ఉండిపోయింది.
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. దాదాపు ఏడాది కాలంలో వైసీపీ(Ysr Congress party)బలం మండలిలో పెరిగింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బలం తగ్గిపోయింది. ఫలితంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బిల్లుల్ని అడ్డుకునే పరిస్థితి లేదు. అందుకే వైసీపీ నేతలు ఈ విషయంపై పెద్దగా ఎక్కడా స్పందించడం లేదు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఇందుకు అనుగుణంగా వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. శాసనమండలి రద్దు చేస్తూ చేసిన తీర్మానంపై కేంద్ర ప్రభుత్వాన్ని(Central government) ఒత్తిడి చేయమని తెలిపారు. మండలి రద్దు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మండలి రద్దు నిర్ణయం నుంచి వైసీపీ వెనక్కి తగ్గుతుందనడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. మండలిలో కావల్సిన బలం ఉన్నందున..బిల్లులకు ఎటువంటి అడ్డంకి కలగదు. అందుకే మండలిని రద్దు చేస్తే వైసీపీకు కొత్తగా వచ్చే ప్రయోజనం లేదు కాబట్టి..ఆ నిర్ణయానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదల్చుకోలేదు అధికార పార్టీ. మొన్నటివరకూ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షం తెలుగుదేశం(Telugu Desam)..ఇప్పుడు రద్దు చేయాలని అంటోంది.
Also read: YSR Cheyutha 2021: వైఎస్సార్ చేయూత పథకం.. ఆ మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.18,750 జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook