కరోనా నిర్ధారణ పరీక్ష ( Covid19 test ) ల్లో ఏపీ మరోసారి రికార్డు సృష్టించింది. ఓ వైపు పరీక్షల సంఖ్య పెరుగుతున్నా..కేసుల సంఖ్య మాత్రం భారీగా తగ్గుతోంది.
కోవిడ్ 19 నియంత్రణలో ముఖ్యమైన ట్రేస్, టెస్ట్, ట్రీట్ ప్రోటోకాల్‌ను పూర్తిగా పాటిస్తోంది ఏపీ ప్రభుత్వం ( Ap Governent ). కరోనా వైరస్ ( Corona virus ) రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుంచి పరీక్షల సామర్ధ్యాన్ని పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పెద్దఎత్తున పరీక్షలు చేస్తూ వస్తోంది. రోజుకు 75-85 వేల పరీక్షలు నిర్వహిస్తోంది.
గత 24 గంటల్లో ఏకంగా 85 వేల 364 పరీక్షలతో కొత్త రికార్డు సృష్టించింది ఏపీ. అయితే కొత్త కేసులు మాత్రం కేవలం 2 వేల 745 కేసులే నమోదయ్యాయి. అక్టోబర్ నెలకు ముందైతే రోజుకు 10-11 వేల కొత్త కేసులు వెలుగుచూసిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 35 వేల 953కు చేరుకుంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం 21 వేల 878కు తగ్గిపోయింది.
గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 13 మంది మరణించగా..ఇప్పటివరకూ 6 వేల 757 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 2 వేల 292 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. Also read: AP: కేబినెట్ కీలక నిర్ణయాలు, కొత్త ఇసుక పాలసీ
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR