Metro Land Acquisition: ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసి ఆర్ధిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు తాజాగా భూసేకరణకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
ఏపీలో త్వరలో ఒకేసారి విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. డీపీఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు భూ సేకరణకు అనుమతి జారీ చేసింది. ఈ రెండు నగరాల్లోనూ మెట్రో ప్రాజెక్టు కోసం 199 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖపట్నంలో 9 ఎకరాలు సేకరించనున్నారు. విశాఖపట్నంలో మూడు కారిడార్లు, విజయవాడలో రెండు కారిడార్లలో నిర్మాణం ఉంటుంది. విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34 కిలోమీటర్లు మొదటి కారిడార్ నిర్మిస్తారు. రెండవది గురుద్వార నుంచి పాత పోస్టాఫీసు వరకు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు మూడవ కారిడార్ 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రెండవ దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకూ 30 కిలోమీటర్లతో మరో కారిడార్ నిర్మిస్తారు. విజయవాడలో మాత్రం రెండు దశల్లో మెట్రో నిర్మాణం ఉంటుంది.
ఈ రెండు నగరాల్లోనూ తొలి విడతలో 11 వేల కోట్లు అవసరమౌతాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా నిధులు మంజూరు చేయగానే పనులు ప్రారంభం కావచ్చు. ఈలోగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
Also read: Railway Ticket: రైల్వే కౌంటర్ టికెట్ ఆన్‌లైన్‌లో కేన్సిల్ చేయగలమా, ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి