Inter Weightage Marks: ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు వెయిటేజ్ మార్కుల్లేవు. ప్రవేశ పరీక్ష ఆధారంగానే ర్యాంకులు నిర్ణయివ్వనున్నారు.
నిన్నటి వరకూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులతో పాటు ఇంటర్మీడియట్ మార్కులు కూడా దోహదపడేవి. అంటే ఇంటర్మీడియట్ వెయిటేజ్ మార్కులుండేవి. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. వెయిటేజ్ మార్కుల్ని తొలగింంచింది. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు, సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలుంటాయి.
ఈసారి ఈఎపీసెట్ పరీక్ష 160 మార్కులకు ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా 30 శాతం ఇంటర్ సిలబస్ తగ్గించినందున ఆ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుండవు. మరోవైపు త్రిపుల్ ఐటీ ప్రవేశాల్ని కూడా పదవ తరగతి మార్కుల ఆధారంగానే జరపనున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంగణాల్లో కలిపి 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా జూన్ మొదటి వారాంతానికి పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్ని జూన్ 20 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్ణయించింది. తొలి ఏడాది అడ్మిషన్లను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి..జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
Also read: AP Tenth Exam Results: జూన్ మొదటి వారానికి పదవ తరగతి పరీక్షా ఫలితాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook